దూకుడు పెంచిన జగన్.. వైసీపీకి బూస్ట్ ఇస్తుందా.. ?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ దూకుడు పెంచారు. ఇటీవల కాలంలో పార్టీ ప్రజాప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగా ముందుకు ఎలా వెళ్లాలన్న విషయంపై ఆయన ఆలోచన చేస్తున్నారు. తా జాగా పార్లమెంటు సభ్యులతోనూ జగన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో `జగన్-2.0` సూపర్ యాప్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రజలతో కనెక్ట్ కావాలన్నది కీలక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూ డా దిశానిర్దేశం చేస్తున్నారు.
మరీ ముఖ్యంగా పార్టీ తరఫున జరిగే కార్యక్రమాలకు కూడా హాజరు కావాలని జగన్ నిర్ణయించారు. ఇక, ఇప్పటికే బాధితులకు పరామర్శ పేరుతో ఆయన చేరువ అవుతున్నారు. ఈ పరిణామాలన్నీ.. వైసీపీకి బూస్ట్ ఇస్తాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ప్రజాకోణంలో చూసినప్పుడు.. వైసీపీ ఇంకా చాలానే ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. అదేసమయంలో పార్టీ అధినేతగా జగన్ కూడా మరిన్ని మార్పుల దిశగా అడుగులు వేయా ల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
1) గత తప్పులను సమీక్షించడం: వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ.. కేవలం ఇప్పు డున్న విధంగానే ముందుకు సాగితే ఏమేరకు ఫలితం వస్తుందన్నది ప్రశ్న. పైగా.. కూటమి పార్టీలు.. గత తప్పుల ను ఇప్పటికీ ఎత్తి చూపుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా తప్పులపై సమీక్షించుకుని.. అవసరమైతే.. తప్పు లు పునరావృతకాబోవన్న భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం జగన్‌పై ఉంటుంది.
2) కార్యకర్తల్లో భరోసా: ఇది వైసీపీలో అత్యంత కీలకం. గత 2019 ఎన్నికల సమయంలో కార్యకర్తలు.. జగన్ విజయం కొసం నడుంబిగించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి కార్య కర్తలను డమ్మీలుగా మార్చారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందన్న భావన ఉంది. దీనిపై జగన్ తరచుగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఇంకా భరోసా నింపాల్సిన అవసరం ఉంది.
3) నేతల మధ్య సమన్వయం: నేతల మధ్య సమన్వయం అనేది కేవలం కూటమిలోనే కాదు.. ప్రస్తుత ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలోనూ సమస్యగానే ఉంది. ప్రాంతాలు, జిల్లాల వారీగా నేతల మధ్య సఖ్యత కొరవడుతోంది. కొందరు పార్టీ విధానాలను సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చినప్పుడే.. వైసీపీకి బూస్ట్ వస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.