వారే ముద్దు....మారిన జగన్ ఆలోచనలు!

అంతే కాదు కొత్త వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా వారి సామర్థ్యాన్ని ఆసక్తిని బట్టి కీలక పదవులు కట్టబెట్టాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.;

Update: 2025-07-04 03:00 GMT

వైసీపీ అధినాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సరికొత్తగా ఆలోచన చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీలో ఇక మీదట కొత్తదనమే అంతటా కనిపిస్తుంది అని అంటున్నారు. వైసీపీ పెట్టి పదిహేనేళ్ళు అయింది. రాజకీయంగా జగన్ రాటుతేలారు. ఎన్నో ఆయన చూసుకుని వస్తున్నారు వ్యూహ రచనలో జగన్ స్టైల్ వేరుగా ఉంటుంది అని అంటారు.

ఆయన అన్నీ సైలెంట్ గానే గమనిస్తూ ఏపీ ప్రజల పల్స్ ని పట్టుకునే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. ఇక పార్టీ స్ట్రక్చర్ ని టోటల్ గా చేంజ్ చేయాలని జగన్ చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ వ్యవధి ఉన్నందువల్ల అప్పటికల్లా వైసీపీని పటిష్టంగా మార్చాలని జగన్ చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

అంతే కాదు పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. తాజాగా తాడేపల్లి పార్టీ ఆఫీసులో జరిగిన యువజన విభాగం నాయకుల సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం బాగా పనిచేసే నిబద్ధత కలిగిన వారిని ప్రోత్సహిద్దామని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతే కాదు కొత్త వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా వారి సామర్థ్యాన్ని ఆసక్తిని బట్టి కీలక పదవులు కట్టబెట్టాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. పార్టీని రానున్న రోజులలో బలోపేతం చేయాలీ అంటే యువతకు కొత్త వారికి చాన్స్ ఇస్తేనే మేలు అన్నది జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే వైసీపీ నుంచి చాలా మంది గత కొంతకాలంగా వెళ్ళిపోతూ ఉన్నారు. వారంతా కూటమి పార్టీలలో చేరుతున్నారు. అయితే అక్కడ కూడా ఇమడలేని వారు కొందరు తిరిగి వైసీపీలో చేరేందుకు చూస్తున్నారు. వారు. మళ్ళీ వైసీపీలో చేరాలని చూసినా తీసుకోరాదని అధినాయకత్వం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. పోయిన వారిని మళ్ళీ చేర్చుకోవడం కంటే వారి స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇవ్వాలన్నదే జగన్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు.

ఆ విధంగా చేయడం వల్ల పార్టీకి కొత్త రూపు హుషార్ వస్తుందని మరింత కాలం ధీటుగా జనంలోకి వెళ్ళేందుకు ఉపయోగపడుతుదని అంచనా వేస్తున్నారు. ఇక చూస్తే కనుక మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో కొన్ని చోట్ల ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి. వీటిని ఇంచార్జిలతో భర్తీ చేయకుండా అలాగే ఉంచేశారు.

అయితే సరైన వారికి ఔత్సాహికులు అయితే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చి అయినా ముందుకు నడిపించాలన్నదే జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక యువతకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని జగన్ పార్టీ యువజన విభాగం కార్యక్రమంలో కోరారని అంటున్నారు.

అంటే ఈసారి ఎక్కువగా యువతకే టికెట్లు ఇవ్వాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. రానున రోజులలో పార్టీలో మరిన్ని అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు విద్యార్ధి, అలాగే మహిళా విభాగం నేతలతో కూడా తాడేపల్లి ఆఫీసులో కీలక సమావేశం నిర్వహించడం ద్వారా వారికి సైతం దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు.

అలాగే సోషల్ మీడియా విభాగం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. ఇక రానున్న కాలంలో మరిన్ని జిల్లాల పర్యటనలకు కూడా జగన్ శ్రీకారం చుడతారని అంటున్నారు. మొత్తానికి పార్టీని ఎన్నికల వేళకు బలంగా మార్చేందుకు జగన్ మార్క్ ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News