జగన్ పరామర్శ అపుడేనా ?
ఈ నేపథ్యంలో ఎన్యుమరేషన్ గట్టిగా చేయించాలని ఎంత పంట నష్టం జరిగింది అన్నది వైసీపీ నేతలు దగ్గరుండి రైతుల చేత అధికారులకు వివరాలు ఇప్పించాలని ఆయన కోరారు.;
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలో ఉన్నారు. ఆయన గురువారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కో ఆర్డినేటర్స్ అందరితో ఆయన మొంథా తుఫాన్ గురించి చర్చించారు. అంతే కాదు మొంథా తుఫాన్ అనంతర పరిస్థితుల గురించి వారి నుంచి తెలుసుకున్నారు. పార్టీ పరంగా ఏమి చేయాలి అన్న దాని మీద ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
వారి సంగతేంటి :
ఏపీలో మొత్తం 80 లక్షలకు పైగా రైతాంగం ఉంటే అందులో ఇరవై లక్షల మందికే బీమా ఉందని మిగిలిన అరవై లక్షల మంది సంగతేంటి అని ఆయన ప్రశంచారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు ఈ క్రాపింగ్ బీమా ఉండేదని అంతే కాకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా వారికి ఎప్పటికప్పుడు అన్ని విధాలుగా సమాచారంతో పాటు ఆదుకోవడం జరిగిందని జగన్ పార్టీ నేతలకు చెప్పారు అయితే ఇపుడు కూటమి ప్రభుత్వంలో ధీమా లేదు బీమా లేదని అంటునారు
ఎన్యూమరేషన్ గట్టిగా :
ఈ నేపథ్యంలో ఎన్యుమరేషన్ గట్టిగా చేయించాలని ఎంత పంట నష్టం జరిగింది అన్నది వైసీపీ నేతలు దగ్గరుండి రైతుల చేత అధికారులకు వివరాలు ఇప్పించాలని ఆయన కోరారు. ఈ విషయంలో రైతులకు అండగా ఉండాలని అవసరం అయితే వారి పక్షాన వైసీపీ పూర్తి స్థాయిలో పోరాడాలని జగన్ సూచించారని అంటున్నారు. ఇప్పటికే తుఫాన్ సహాయ చర్యలలో వైసీపీ నేతలు పాలుపంచుకుంటున్నారని ఇంకా ఎక్కువగా పాల్గొనాలని జగన్ కోరారని చెబుతున్నారు. రైతులతోనే వైసీపీ అన్నట్లుగా వ్యవహరించాలని జగన్ చెప్పడం జరిగింది.
వైసీపీ అంచనా :
ఏపీలో మొంతా తుఫాన్ వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని జగన్ చెప్పారు. ఇన్ని ఎకరాలకు ఒక్క పైసా నష్టం రాకుండా రైతుల పక్షాన నిలిచి పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో రతిలకు అండగా ఉండేలా వైసీపీ కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
జగన్ వంతు ఎపుడు :
ఏపీలో చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ తీరం దాటిన మరుసటి రోజులు ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతే కాదు నేరుగా పంట పొలాల్లోకి వెళ్ళి రైతులను పరామర్శించారు. తుఫాన్ సహాయ కేంద్రాలలో కూడా పరిస్థితిని స్వయగా చూశారు బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరొసా ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రిష్ణా జిల్లాలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుందని పవన్ వారికి హామీ ఇచ్చారు ఇలా అధికార పక్షం వైపు నుంచి చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా జనంలో ఉంటున్నారు. వైసీపీ తరఫున చూస్తే పార్టీ వారు అంతా అందుబాటులో ఉండాలని కోరారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ ఎపుడు తుఫాన్ బాధితులను పరామర్శిస్తారు, రైతుల వద్దకు ఆయన ఎపుడు పరామర్శకు వెళ్తారు అన్న ప్రశ్న వస్తోంది.
త్వరలోనే ఉంటుందా :
అధికార పార్టీ నేతల పర్యటనలు హడావుడి తగ్గాక జగన్ నేరుగా రైతుల వద్దకు వెళ్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. రైతులను వైసీపీ తరఫున మద్దతుగా నిలిచేందుకు పార్టీ నేతలను పంపిస్తున్న జగన్ తాను కూడా వెళ్తే బాగుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి జగన్ ఆలోచించుకుని త్వరలోనే పర్యటించే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. ఎపుడు అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.