వైసీపీలో జగన్ తరువాత ఆమె ?
వైసీపీలోనే వైఎస్సార్ ఉన్నారు. అలా తండ్రి పేరుతో ఉన్న పార్టీకి కుమారుడే అధినేత. ఎవరు అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలే అన్న విమర్శలు ఉన్నాయి.;
వైసీపీలోనే వైఎస్సార్ ఉన్నారు. అలా తండ్రి పేరుతో ఉన్న పార్టీకి కుమారుడే అధినేత. ఎవరు అవునన్నా కాదన్నా ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలే అన్న విమర్శలు ఉన్నాయి. ఒకవేళ ఎవరో ఒకరు వచ్చి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టినా కాలగమంలో మిగిలిన కుటుంబ సభ్యులు చేరి కుటుంబ పార్టీగా దానిని మార్చేస్తారు. మరో వైపు చూస్తే పార్టీలలో ప్రజాస్వామ్యం వెతికే ప్రయాసను ఎవరూ చేయడం లేవు. గిట్టని వారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అని అంటున్నా ఆ తరహా విమర్శలను ఎవరూ పట్టించుకోరు కూడా. ఎందుకంటే దేశంలో జాతీయ పార్టీలలో కూడా ఒకటి రెండు తప్పించి అన్నీ ఆ తానులో ముక్కలే కాబట్టి.
నాడు తల్లి చెల్లి :
వైసీపీలో ఒకనాడు తల్లి చెల్లి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ నుంచి జగన్ బయటకి వచ్చినపుడు ఆయన వెంట విజయమ్మ షర్మిల ఉండేవారు. వైసీపీ విజయానికి విజయమ్మ షర్మిల అలుపెరగని తీరులో పోరాడారు. ప్రత్యర్ధుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రాజకీయాలకు కొత్త అయినా ఈ చదరంగంలో నలిగిపోయారు. ఎన్నో దూషణ భూషణలు ఎదుర్కొన్నారు ఇదంతా వారు జగన్ కోసమే చేశారు. ఎపుడైతే జగన్ వారికి మధ్య వ్యాపార ఒప్పందాల విషయంలో వివాదాలు వచ్చాయో వేరు పడిపోయారు అంతే కాదు కోర్టుల దాకా ఆస్తుల వ్యవహారాలు వెళ్లాయి. దాంతో వైసీపీలో జగన్ ఒంటరిగా ఉన్నారు అని అంటున్నారు.
షర్మీల ప్రత్యర్థిగా :
ఒకనాడు అన్న జగన్ జైలులో ఉంటే ఆయన కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లెమ్మ షర్మిల ఇపుడు ప్రత్యర్థిగా మారారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ రాజకీయ పతనాన్ని కోరుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన వంతు చేయి కూడా వేశారు. ఇపుడు కూడా ఆమె జగన్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక వైసీపీలో జగన్ తరువాత ఎవరు అన్నది కూడా తెలియడం లేదు. సొంత కుటుంబీకులను నమ్ముకోవాలని చూసినా ఎవరూ కనిపించడం లేదు అని అంటున్నారు. దాంతో చాలా కాలంగా ఆయన సతీమణి భారతి పేరు వినిపిస్తోంది ఆమె జగన్ కి చేదోడు వాదోడుగా పార్టీకి ఉంటారు అని చెప్పుకునేవారు. అయితే ఇపుడు అవే వార్తలు నిజం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
యాక్టివ్ గానే పాలిటిక్స్ లోకి :
వైఎస్ భారతి వైసీపీలో చురుకైన పాత్ర పోషించబోతున్నారు అనడానికి ఎన్నో సంకేతాలు కనిపిస్తునాయని అంటున్నారు. మరి ఈ వార్తలు ప్రచారం ఎలా వచ్చాయి అంటే సంచలన వార్తలకు పేరు గడించిన ఒక తెలుగు మీడియా చానల్ తాజాగా ఈ విషయాల మీద చెప్పాల్సింది చెబుతోంది అని అంటున్నారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భారతి భావించారు అని అంటారు. అయితే ఆమె ఇపుడు మనసు మార్చుకున్నారని ఒంటరిగా ఉన్న జగన్ కోసం సహాయంగా ఆమె రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. సదరు తెలుగు మీడియా కధనాల మేరకు చూస్తే కనుక వైఎస్ భారతి వైసీపీ కీలక నాయకులతో మట్లాడుతున్నారని అంటున్నారు. ఆమె పార్టీ విషయాలను కూడ వారిని అడిగి తెలుసుకుంటున్నారు అని కూడా అంటున్నారు.
జగన్ పరోక్షంలో :
ప్రస్తుతం ఏపీలో చూస్తే లిక్కర్ స్కాం మీద విచారణ జోరుగా సాగుతోంది. ఇందులో జగన్ పాత్ర మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ అనుకోనిది జరిగి జగన్ కనుక అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాల్సి వస్తే అపుడు పార్టీ బాధ్యతలను భారతి టేకప్ చేస్తారు అని అంటున్నారు. అందుకే ఆమె ఇప్పటి నుంచే పార్టీ యాక్టివిటీని పెంచారని అంటున్నారు. పార్టీలో ఏమి జరుగుతోంది అన్నది ఆమె తెలుసుకుంటున్నారు అని అంటున్నారు. జగన్ తరువాత పార్టీని నడిపించే శక్తి యుక్తులు భారతికి ఉన్నాయని అంటున్నారు. ఇప్పటిదాకా జగన్ వ్యాపారాలలో భాగస్వామిగా ఉంటూ అవన్నీ చక్కబెడుతూ వచ్చిన భారతి ఇక మీదట జగన్ రాజకీయాల్లోనూ భాగస్వామిగా ఉంటారా అన్నది అయితే చర్చగా ఉంది. వైసీపీ వరకూ చూస్తే జగన్ కి ఇబ్బందులు ఎదురైతే పార్టీని లీడ్ చేయడానికి భారతి తప్పించి మరో ఆల్టర్నేషన్ అయితే లేదు. ఆ విషయం పార్టీలో అందరికీ తెలుసు అని అంటున్నారు. అందుకే ఆమె ఇపుడు మెల్లగా రాజకీయ అడుగులు వేస్తున్నారా అన్నదే ఒక హాట్ టాపిగా ఉంది.