బలవంతం లేదు, మీకు మీరే వెళ్లిపోవచ్చు... ఉద్యోగులకు యూట్యూబ్ కొత్త ఆఫర్!

అవును... ఇప్పటికే అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-10-30 15:30 GMT

గత కొంతకాలంగా రకరకాల కారణాలతో పలు దిగ్గజ సంస్థలు లే ఆఫ్ లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతున్నారు. అయితే ఇటీవల కాలంలో పలు భారీ సంస్థలో లే ఆఫ్ లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్ నుంచి తమ ఉద్యోగులకు సరికొత్త ఆఫర్ తెరపైకి వచ్చింది. అదే... వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్!

అవును... ఇప్పటికే అమెజాన్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమ శ్రామికశక్తిని భారీగా తగ్గించుకునే క్రమంలో.. పెద్ద ఎత్తున లేఆఫ్‌ లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ సీఈవో నీల్ మోహన్ ఓ కీలక ప్రకటన చేశారు.

వివరాళ్లోకి వెళ్తే... గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తోన్న వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ యూట్యూబ్... తన ఉత్పత్తులు, సేవల విభాగాల్లో ఏఐ వాడకాన్ని విస్తృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. రెండేళ్ల నుంచి అమెరికాలో నంబర్‌ వన్ స్ట్రీమర్‌ గా కొనసాగుతోన్న ఈ ప్లాట్‌ ఫామ్‌.. క్రియేటర్లు, భాగస్వాములకు $100 బిలియన్లకు పైగా చెల్లించిందని సీఈవో చెప్పారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తున్నప్పుడు.. ప్రతి విభాగాన్ని మార్చగల సామర్థ్యం ఏఐకు ఉందని అర్థమైందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ విషయాన్ని ప్రస్థావించిన ఆయన... అర్హత కలిగిన అమెరికా ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్‌ ను ఆఫర్ చేశారు. దానికి అంగీకరించిన వారికి పరిహార ప్యాకేజీ అందనుందని వెల్లడించారు. ఏఐ చుట్టూ పెరుగుతున్న ఆశయాలకు అనుగుణంగా పది సంవత్సరాలలో మొదటిసారిగా యూట్యూబ్ తన ప్రొడక్ట్ విభాగాన్ని పునర్నిర్మిస్తున్నట్లు మోహన్ సిబ్బందికి రాసిన నోట్‌ లో తెలిపారు.

దీంతో.. ఏ ఉద్యోగినీ బలవంతంగా తొలగించడం లేదని ప్లాట్‌ ఫామ్ స్పష్టం చేసినప్పటికీ.. కంటెంట్ సృష్టి, సిఫార్సు, వినియోగదారు అనుభవంలో ఏఐ చాలా పెద్ద పాత్ర పోషిస్తున్న భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలనే సంస్థ ఉద్దేశ్యాన్ని సూచిస్తుందని అంటున్నారు. మరోవైపు యూట్యూబ్ తన పునర్నిర్మాణంలో.. ప్రొడక్ట్ డివిజన్‌ ను వ్యూయర్ ప్రొడక్ట్స్‌, క్రియేటర్ & కమ్యూనిటీ ప్రొడక్ట్స్‌, సబ్‌ స్క్రిప్షన్‌ ప్రొడక్ట్స్‌ వంటి మూడు విభాగాలుగా విభజించనుందని అంటున్నారు.

జోహన్నా ఆధ్వర్యంలో వ్యూయర్ ప్రొడక్ట్!:

యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జోహన్నా వూలిచ్.. వ్యూయర్ ప్రొడక్ట్స్ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ గ్రూప్ ప్రధానంగా యూట్యూబ్ యాప్, సెర్చ్ అండ్ డిస్కవరీ, లివింగ్ రూమ్, యూట్యూబ్ కిడ్స్, లెర్నింగ్, ట్రస్ట్ అండ్ సేఫ్టీతో పాటు ముఖ్యంగా వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ నిర్వచించే ప్రతిదాన్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా లివింగ్ రూమ్‌ లో వృద్ధిని వేగవంతం చేయడం ఈ బృందం లక్ష్యం అని మోహన్ అన్నారు.

క్రిస్టియన్ నేతృత్వంలో సబ్ స్క్రిప్షన్స్ బృందం!:

క్రిస్టియన్ ఓస్ట్లియన్ నేతృత్వంలోని సబ్‌ స్క్రిప్షన్‌ ల బృందం.. యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం, యూట్యూబ్ టీవీ, ప్రైమ్‌ టైమ్ ఛానెల్‌ లు, పాడ్‌ కాస్ట్‌ లతోపాటు రెవెన్యూని పర్యవేక్షిస్తుంది. కాగా... యూట్యూబ్ సబ్‌ స్క్రిప్షన్ బిజినెస్ ఇటీవలి కాలంలో దాని బలమైన ఆదాయ వనరులలో ఒకటిగా మారింది ఇందులో భాగంగా... ఇప్పుడు దాని ప్రీమియం, యూట్యూబ్ టీవీ సేవలలో 125 మిలియన్లకు పైగా పెయిడ్ యూజర్స్ ని కలిగి ఉంది.

జోహన్నా వూలిచ్ కు అదనపు బాధ్యతలు!:

క్రియేటర్ & కమ్యూనిటీ ఉత్పత్తులు, క్రియేషన్ టూల్స్‌ ను విస్తరించడం, బలమైన కమ్యూనిటీ ఎకోసిస్టమ్‌ ను నిర్మించడంపై క్రియేటర్ & కమ్యూనిటీ ప్రొడక్ట్స్‌ దృష్టి పెడతాయి. ఇందులో షార్ట్స్, లైవ్, క్రియేటర్‌ ల కోసం పెరుగుతున్న జనరేటివ్ ఏఐ ఫీచర్‌ లు ఉన్నాయి. అయితే ఈ బృందానికి కంపెనీ ఇంకా శాశ్వత నాయకుడిని పేర్కొని నేపథ్యంలో.. వూలిచ్ దీనిని తాత్కాలికంగా నిర్వహించనున్నారు.

Tags:    

Similar News