వైసీపీ ఎంపీల ప‌నితీరు ఇదేనా.. ఎవ‌రు బెస్ట్‌...?

గడిచిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ కేవలం నలుగురు మాత్రమే ఎంపీలుగా విజయం దక్కించుకున్నారు.;

Update: 2025-06-21 23:30 GMT
వైసీపీ ఎంపీల ప‌నితీరు ఇదేనా.. ఎవ‌రు బెస్ట్‌...?

గడిచిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ త‌ర‌ఫున‌ కేవలం నలుగురు మాత్రమే ఎంపీలుగా విజయం దక్కించుకున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఈ ఎంపీల పనితీరు ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు అనే విషయాలను గమనిస్తే ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం నలుగురు ఎంపీల్లో ఇద్దరు మాత్రమే ఒకంత పరవాలేదు అన్నట్టుగా ఉంటే మరో ఇద్దరూ చాలా వెనుకబడి ఉన్నారని మాట వినిపిస్తోంది. తిరుపతి నుంచి విజయం దక్కించుకున్న గురుమూర్తి మా మంచి ఎంపీగా పేరు తెచ్చుకోవడం విశేషం.

అందరికీ తల్లో నాలుక‌లా ఉంటూ సహాయం చేయడంలోనూ సమస్యల పరిష్కారంలోను ఆయన చొర‌వ చూపిస్తున్నారని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ చిత్రమేంటంటే పార్టీలకు అతీతంగా గురుమూర్తికి మంచి మార్కులు వేయడం. సహజంగా టిడిపికి, జనసేనకు పట్టు ఉన్న తిరుపతి నియోజకవర్గంలో గురుమూర్తికి మంచి మార్కులు పడడం అంటే ఒకింత చెప్పుకోవాల్సిన విషయం. వ్యక్తిగానే కాకుండా నాయకుడిగా కూడా ఆయన ఎలాంటి మచ్చలు లేకుండా ముందుకు సాగుతున్నారు.

ఇక కడప ఎంపీ అవినాష్ రెడ్డి చాలా వెనుకబడ్డారు. గత ఎన్నికల్లో బోటాబట్టి మార్కులతో విజయం సాధించిన ఆయన ప్రజల హృదయాలను గెలుచుకోవడంలో వెనుకబడ్డారని చెప్పాలి. పార్లమెంటుకు హాజరు కావడం, ప్రజల సమస్యలపై స్పందించడం, వంటి విషయాల్లో చాలా తక్కువ మార్కులే పడ్డాయి. ఇక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం పార్టీ నాయకుల పట్ల స్పందిస్తున్న తీరు పార్లమెంట్లో వ్యవహరిస్తున్న విధానాలపై ప్రజలు కొంతమేరకు సంతృప్తిగానే ఉన్నారు. బాగానే పనిచేస్తున్నారు అని 42 శాతం మంది ప్రజలు చెబుతుండగా మిగిలిన వారిలో కూడా పరవాలేదు అనే మాట వినిపిస్తోంది.

ఇక అరకు ఎంపీ తనూజ రాణి పని తీరు మాత్రం ఏం బాగాలేదు అన్నట్టుగా ప్రజలు చెబుతుండడం స్థానికంగా కూడా ఆమెకు వ్యతిరేకంగా వైసిపి నాయకులే వ్యవహరించడం వంటివి సర్వేలో వెలుగు చూశాయి. మొత్తంగా ఈ నలుగురు విషయంలో ఒక గురుమూర్తి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే మిథున్ రెడ్డి రెండో స్థానంలో నాలుగో స్థానంలో అవినాష్ రెడ్డి తనుజరాణి ఉండడం విశేషం.

Tags:    

Similar News