తోపుదుర్తి వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తాజాగా వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.;
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి , ప్రతిపక్ష వైకాపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు వివాదాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగు సినిమాకు చెందిన ఒక నటితో ఆయన విమానాశ్రయంలో సన్నిహితంగా ఉన్న వీడియోను ఒక రాజకీయ పార్టీ నేతలు ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసి వైరల్ చేశారు. ఈ వీడియోను అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకుడు , ఆ హీరోయిన్ పై దుష్ప్రచారం చేశారు. అయితే, ఆ వీడియోలో ఉన్న మహిళ తెలుగు నటి సుమయా రెడ్డి అని తేలింది. ఆమె తోపుదుర్తికి బంధువు అవుతుంది..
ఈ వివాదంపై సుమయా రెడ్డి తాజాగా ఒక వీడియోను విడుదల చేసి స్పందించారు. "నేను 'డియర్ ఉమ' అనే సినిమాలో నటిస్తున్నాను. ప్రస్తుతం దాని ప్రమోషన్లలో బిజీగా ఉన్నాను. ఇంతలో నా సన్నిహితుల నుండి ఆందోళనకరమైన మెసేజ్‌లు వచ్చాయి. కొంతమంది ఒక వీడియోను షేర్ చేసి, తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు , ఊహాగానాలు చేస్తున్నారని తెలిసింది. ఇది చాలా బాధాకరం. రాజకీయ లబ్ధి కోసం ఒక మహిళను ఉపయోగించడం ఖండించదగినది" అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా సుమయా రెడ్డితో తన కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోలను షేర్ చేశారు. తామంతా బంధువులం అని.. కుటుంబ సభ్యులుగా ఉంటామని స్పష్టం చేశారు. సుమయారెడ్డి తనకు కుమార్తె లాంటిదని పేర్కొన్నారు.
నిన్నటి నుండి వైసీపీ నాయకుడిపై ఒక విధంగా దుష్ప్రచారం జరుగుతుండగా ఆయన ఈరోజు దీనిపై తీవ్రంగా ఖండించారు. ఈ దుష్ప్రచారాన్ని సృష్టించి, వ్యాప్తి చేసిన వ్యక్తిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకాష్ రెడ్డి తెలిపారు.