పెద్దాయన జీవిత కాలం కోరిక తీరేనా ?
దాంతో యనమల ఈసారి గట్టిగానే గురి పెట్టారు అని అంటున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళాలన్న తన జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం వేరేది లేదని కూడా భావిస్తున్నారు.;
టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న వారు ఆయన. పార్టీకి ప్రభుత్వానికి ఒక అండగా ఉన్న వ్వక్తి. ఏ సబ్జెక్ట్ గురించి అయినా మాట్లాడమంటే ఆయన తరువాత ఎవరైనా. ఆయనే యనమల రామక్రిష్ణుడు. ఆయన ఈసారి రాజ్యసభ రేసులో చాలా ముందుగానే ఉన్నారు. తనకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ఆయనకు ఈనాటి బాధ కాదు, 2016 నుంచి ఉంది అని అంటున్నారు. అంటే దశాబ్ద కాలం నాటి కోరిక అన్న మాట.
అప్పట్లో కీలకంగా :
ఏపీ విభజన తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో యనమల ఆర్ధిక మంత్రిగా కీలకంగా వ్యవహరించారు దాంతో ఆయన మధ్యలోనే తనకు రాజ్యసభ సీటు ఇస్తే చాలు అని కోరినా టీడీపీ అధినాయకత్వం మాత్రం ఏపీలోనే సేవలు అవసరం అని నచ్చచెప్పిందని అంటారు. ఇక 2017లో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. దాంతో పాటుగా 2019లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే దక్కడంతో రాజ్యసభ ఆలోచనలు అయినా టీడీపీ చేయలేకపోయింది. కనేఎ ఈసారి మొత్తం అసెంబ్లీ సీట్లు అన్నీ కూటమికే ఉన్నాయి. దాంతో ఎన్ని రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే అన్నీ టీడీపీ కూటమికే వస్తాయి.
భారీ టార్గెట్ :
దాంతో యనమల ఈసారి గట్టిగానే గురి పెట్టారు అని అంటున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళాలన్న తన జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి ఇంతకంటే మంచి తరుణం వేరేది లేదని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన వయసు ఇపుడు ఏడున్నర పదులు దాటింది. ఈ దఫా కనుక చాన్స్ ఇస్తే ఆరేళ్ల పాటు పెద్దల సభలో పదవిలో ఉంటూ ఆ మీదట గౌరవనీయమైన పదవీ విరమణ చేయాలని చూస్తున్నారుట. అందుకే ఒక్క చాన్స్ తనకే ఇవ్వాలని కోరుతున్నారని చెబుతున్నారు.
పార్టీ అన్నీ ఇచ్చింది :
ఇదిలా ఉంటే యనమల రాజ్యసభ సీటు కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు కానీ పార్టీ ఆయనకు ఆయన కుటుంబానికీ ఎంతో మేలు చేసింది అని గుర్తు చేస్తున్నారు. అనేక పర్యాయాలు ఆ కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని యనమలను రెండు సాల్రు ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపించిందని దశాబ్దాల పాటు మంత్రి హోదాతో పాటు స్పీకర్ గా కూడా ఆయనకు అవకాశాలు ఇచ్చిందని చెబుతున్నారు. ఇక ఆయన పెద్ద కుమార్తెకు తుని టికెట్ ని 2024 లో ఇచ్చి ఎమ్మెల్యేగా చేసిందని, చిన్న అల్లుడిని ఏలూరు నుంచి ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించిందని గుర్తు చేస్తున్నారు. యనమల వియ్యంకుడికి మైదుకూరు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసిందని అంటున్నారు ఇంత చేసిన పార్టీ ఇంకా తమకే చేయాలని కోరడమే కొంత ఇబ్బందికరమైన విషయం అని అంటున్నారు.
దక్కుతుందా అంటే :
ఈ ఏడాది జూన్ నాటికి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో టీడీపీకి రెండు దక్కుతాయని చెబుతున్నారు. ఈ రెండింటిలో కూడా ఒకటి సిట్టింగ్ ఎంపీగా ఉంటూ కేవలం ఏడాది మాత్రమే పదవిలో ఉన్న సానా సతీష్ కే తిరిగి రెన్యూల్ చేస్తారని అంటున్నారు. అంటే ఉన్నది ఒకే ఒక సీటు అన్న మాట. దాని కోసం టీడీపీలో హెవీ కాంపిటేషన్ ఉంది. మరి టీడీపీ పెద్దలు యనమల విషయంలో ఏమి ఆలోచిస్తారు, చివరి చాన్స్ అంటున్న పెద్దాయన ఆశలు నెరవేరుతాయా అంటే వెయిట్ అండ్ సీ.