ఎమ్మెల్యే పదవి ఊడుతుందంటూ జగన్ కి యనమల హెచ్చరిక

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామక్రిష్ణుడు. ఆయన ముప్పయ్యేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పన్నెండేళ్ళ పాటు ఎమ్మెల్సీగా దశాబ్దాల పాటు మంత్రిగా అయిదేళ్ళ పాటు స్పీకర్ గా పనిచేశారు.;

Update: 2025-11-27 17:50 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామక్రిష్ణుడు. ఆయన ముప్పయ్యేళ్ళ పాటు ఎమ్మెల్యేగా పన్నెండేళ్ళ పాటు ఎమ్మెల్సీగా దశాబ్దాల పాటు మంత్రిగా అయిదేళ్ళ పాటు స్పీకర్ గా పనిచేశారు. ఇక ఉమ్మడి ఏపీలో 1995 ఆగస్టు సంక్షోభం సమయంలో యనమల స్పీకర్ గా కీలక పాత్ర పోషించి సుస్థిర పాలన దిశగా రాష్ట్రాన్ని నడిపించారు అని గుర్తు చేసుకుంటారు.

పూర్తి పట్టుతో :

యనమలకు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద పూర్తి పట్టు ఉంది ఆయన అనేక ఏళ్ల పాటు శాసనసభా వ్యవహారాలు చూశారు. ఏ అంశం మీద ఏమి మాట్లాడాలో చెబుతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సభా వ్యవహారాలు ఆయనకు కరతలామలకం గా ఉంటాయని అంటారు. ఆయన సభలో ఉంటే ఎవరూ రూల్స్ బుక్ వైపే చూడాల్సిన పనిలేదు. ఆయనే సెక్షన్ తో సహా అలవోకగా చెబుతారు. ఇదిలా ఉంటే గత ఆరు నెలలుగా యనమల మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాజ్యసభకు వెళ్ళాలని అనుకుంటున్నారు.

మాక్ అసెంబ్లీని చూడాలి :

ఇదిలా ఉంటే యనమల తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కి హెచ్చరిస్తూనే ఒక కీలక సూచన చేశారు. మాక్ అసెంబ్లీలో పిల్లలు చక్కగా సభను నడిపించారని ఆయన అంటూ జగన్ వారిని చూసి అయినా నేర్చుకోవాలని ఆయన అన్నారు. జగన్ ప్రజా సమస్యల పట్ల ఎలా వ్యవహరించాలో వారి నుంచి అయినా నేర్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ సభకు వచ్చి ప్రజా సమస్యల మీద చర్చిస్తే బాగుంటుంది అని సూచించారు.

జగన్ కి హెచ్చరిక :

ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదిక చట్ట సభ అని ఆయన గుర్తు చేశారు. బయట మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదని అన్నరు సభలోనే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన అన్నారు జగన్ ఈ విషయం మరచి బయట మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవ్వాలని లేకపోతే ఆయా త్వరలోనే తమ ఎమ్మెల్యే పదవికి అర్హతను కోల్పోయే ప్రమాదం ఉందని యనమల హెచ్చరించడం విశేషం.

గతంలోనూ చెప్పినా :

ఒక ఎమ్మెల్యే స్పీకర్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వరుసగా సభకు అరవై రోజుల పని దినాలలో కనుక గైర్ హాజరు అయితే కచ్చితంగా ఎమ్మెల్యే సభ్యత్వం కోల్పోతారు అన్నది రూల్స్ లో ఉందని అంటున్నారు. గతంలోనే దీని మీద చర్చ జరిగింది. ఇక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయంగా ఉంటుంది. దాని మీద కోర్టుకు వెళ్ళినా తిరిగి స్పీకర్ కే వదిలిపెడతారు. అందువల్ల వింటర్ సెషన్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుందని ఒక వైపు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పెద్దాయన యనమల చేసిన సూచనలు అయితే మరోసారి చర్చలోకి వస్తున్నాయి. జగన్ తో సహా 11 మంది ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ వేటు వేస్తుందా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. యనమల దీని మీద జగన్ ని హెచ్చరించడం కూడా విశేషంగా చూస్తున్నారు.

Tags:    

Similar News