ఒకేసారి ఏడు బస్సులకు మంటలు.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!

ఈ సమయంలో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని చెప్పిన శ్లోక్ కుమార్.. ఇప్పటివరకూ నలుగురు మరణించినట్లు నిర్ధారించబడిందని వెల్లడించారు.;

Update: 2025-12-16 05:05 GMT

ఇటీవల హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒకేసారి ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్న ఘటన యమునా ఎక్స్ ప్రెస్ వే పై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

అవును... యూపీలోని మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. మధుర జిల్లాలోని బాల్డియో పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్ స్టోన్ 127 సమీపంలోని యమునా ఎక్స్ ప్రెస్ వే లోని ఆగ్రా-నొయిడా స్ట్రెచ్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత నాలుగు బస్సులకు మంటలు అందుకోవడంతో బాధితులు సజీవ దహనం అయ్యారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి!

గాయపడిన వారందరనీ ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన మధుర ఎస్.ఎస్.పీ. శ్లోక్ కుమార్... తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో దృశ్యమానత తక్కువగా ఉండటం అల్ల సుమారు ఏడు బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికొనటి ఢీకొన్నాయని తెలిపారు. ఢీకొన్న తర్వాత వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని వెల్లడించారు.

ఈ సమయంలో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని చెప్పిన శ్లోక్ కుమార్.. ఇప్పటివరకూ నలుగురు మరణించినట్లు నిర్ధారించబడిందని వెల్లడించారు. గాయపడిన 25 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ వే పూర్తిగా బ్లాక్ చేయబడిందని.. ట్రాఫిక్ వెనుక నుంచి మళ్లించబడిందని.. ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి మిగిలిన ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపామని అన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్.. మొదటి మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని.. ఆ తర్వాత ఏడు బస్సులు వాటిపైకి దూసుకుపోయాయని తెలిపారు. ఈ సమయంలో పదకొండు యంత్రాలు సంఘటన స్థలంలో ఉన్నాయని.. మంటలను ఇప్పుడు అదుపులోకి తెచ్చారని.. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను వెలికితీశారని తెలిపారు.

Tags:    

Similar News