38 ప్రైవేట్ జెట్స్, 52 గోల్డెన్ బోట్స్, 4 వైఫ్స్... ఎవరు రాజా మీరు..!

అవును... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజుగా నిలుస్తున్నారు మహా వజిరలంగ్కోర్న్.;

Update: 2026-01-09 18:30 GMT

సాధారణంగా ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ఠక్కున చెప్పే పేరు.. స్పేస్ ఎక్స్ సీఇఓ ఎలాన్ మస్క్ అని. ఇలా మస్క్ లా సాంకేతికతను ఉపయోగించుకుని, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు చేస్తూ విస్తారమైన సంపదను సృష్టించే వారూ ఉంటే.. అతని రాజ వంశపారంపర్యత, జాతీయ అధికారం, దేశంపై నాయకత్వం కలిగి ఉండటం వెరసి.. ఇతర బిలియనీర్లతో పోలిస్తే ఊహించలేనంత పెద్ద మొత్తంలో సంపద కలిగి ఉన్నట్లు గుర్తించబడుతున్నారు థాయిలాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్, కింగ్ రామ ఎక్స్.

అవును... ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన రాజుగా నిలుస్తున్నారు మహా వజిరలంగ్కోర్న్. ఈ సందర్భంగా ఆయనకున్న ఆస్తులు, వాటిపై వచ్చే అద్దెలు, వ్యాపారాలు, వాటితో వచ్చే ఆదాయం.. ఇక బ్యాంకుల్లో షేర్లు, ఉన్న కార్లు, బోట్లు, ప్రైవేటు జెట్లు వెరసి.. అత్యంత సంపన్న చక్రవర్తిగా ఈయన గుర్తింపు పొందారు. కింగ్ రామ ఎక్స్ మొత్తం సంపద సుమారు 50 బిలియన్ డాలర్లు అని చెబుతున్నారు. అంటే... దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ సంపదకు కీలకమైన స్తంభం క్రౌన్ ప్రాపర్టీ బ్యూరో (సీపీబీ)!

ఈ థాయ్ చక్రవర్తి ప్రాథమిక ఆదాయ వనరు స్తంభం క్రౌన్ ప్రాపర్టీ బ్యూరో అని చెబుతారు. పలు అంచనాల ప్రకారం అతను థాయిలాండ్ అంతటా సుమారు 16,210 ఎకరాల భూమి కలిగి ఉండగా.. అందుల్లో తనకున్న రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, హోటళ్లు, ప్యాలెస్ లకు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్స్ దాదాపు 40,000 కంటే ఎక్కువ ఉన్నట్లు చెబుతారు. ఇందులో సుమారు 17,000 కంటే ఎక్కువ బ్యాంకాక్‌ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.

ఈ క్రమంలో ఈ థాయిలాండ్ చక్రవర్తి మరో కీలక ఆదాయ వనరుగా బ్యాంక్, సిమెంట్ గ్రూపులో వాటాలు ఉన్నయి. ఇందులో భాగంగా.. థాయిలాండ్‌ లోని రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌ లో ఈ కింగ్ కు సుమారు 23% వాటాలు ఉండగా.. ప్రముఖ పారిశ్రామిక సమ్మేళనం అయిన సియామ్ సిమెంట్ గ్రూప్‌ లో సుమారు 33% వాటాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి ఆయన ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.

ఇక ఈ కింగ్ విలాసవంతమైన జీవితం విషయానికొస్తే... అతని పేరుతో ఉన్న వేలాది ఆస్తుల కారణంగా... అతను ప్రతి రాత్రి వేరే నివాసంలో బస చేసినా.. మళ్ళీ మొదట బస చేసిన నివాసానికి రావాలంటే దాదాపు 47 సంవత్సరాలు పడుతుందని చెబుతారు. అతని కలక్షన్ లో 38 ప్రైవేట్ జెట్‌, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని తెలుస్తోండగా.. అతని రాజభవనం లోపల రోల్స్ రాయిస్, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్ వాహనాలతో సహా 300కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి! ఇదే క్రమంలో... 52 బంగారు పూత పూసిన బోట్స్.. వాటితో పాటు వజ్రాలు, బంగారు ఆభరణాలు ఎన్నో ఎన్నో అని చెబుతున్నారు!

అదేవిధంగా కింగ్ పూర్తి పర్సనల్ లైఫ్ విషయానికొస్తే... అతనికి నాలుగు సార్లు వివాహం అయ్యింది! ఇందులో భాగంగా... మొదట 1977లో యువరాణి సోంసవాలిని వివాహం చేసుకోగా.. ఆ తర్వాత కాలంలో నటి యువధిదా తో సంబంధాన్ని ప్రారంభించే వరకు ఆ వివాహం కొనసాగింది. ఈ జంట 1994లో అధికారిక వివాహం చేసుకున్నారు. ఆ సంబంధం కూడా రెండేళ్ల తర్వాత ముగియగా.. 2001లో శ్రీరస్మి సువాడీని వివాహం చేసుకున్నాడు. తరువాత.. వజిరలాంగ్‌ కార్న్ మాజీ విమాన సహాయకురాలు అయిన రాణి సుతిదా ను వివాహం చేసుకున్నాడు.

Tags:    

Similar News