ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లో విలనిజం బాగా తగ్గిపోయిందా?

విలనిజానికి నెక్స్ట్ లెవల్ గుర్తింపు ఉన్న సందర్భంలో అందరు విలనిజాన్ని టాప్ రేంజ్ లో చూపించారు.

Update: 2026-09-30 19:30 GMT

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన గుర్తింపు రావడమే కాకుండా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేస్తు పలు రికార్డులను కొల్లగొట్టే విధంగా కలెక్షన్స్ ను కూడా రాబడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోల నుంచి వస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తున్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలనిజం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. రాజమౌళి సినిమాల్లో గాని మిగతా దర్శకులు చేసిన సినిమాల్లో విలనిజం చాలా బాగా ఎలివేట్ చేశారు. ముఖ్యంగా 'సింహాద్రి' మూవీలో ముఖేష్ ఋషి, 'ఒక్కడు' సినిమాలో ప్రకాష్ రాజ్, జయం, నిజం సినిమాల్లో గోపీచంద్, అరుంధతి సినిమాలో సోనుసూద్ ఇలా చాలామంది నటులు వాళ్ల విలనిజాన్ని చూపించి స్టార్ యాక్టర్స్ గా ఎదిగారు. విలనిజానికి నెక్స్ట్ లెవల్ గుర్తింపు ఉన్న సందర్భంలో అందరు విలనిజాన్ని టాప్ రేంజ్ లో చూపించారు.

మరి ఇప్పుడు ఆ విలనిజాన్ని తగ్గించడానికి గల కారణం ఏంటి? నిజానికి ఇప్పుడున్న సినిమాల్లో అసలు విలన్ అనే వాడు పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోతున్నాడు... అప్పట్లో విలన్స్ ను చూస్తేనే భయం వేసేది. వాళ్ళకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉండేది వాటిని మెయింటైన్ చేస్తూ సినిమాలో అరాచకాలు చేసేవారు. ఇప్పుడున్న దర్శకులు అలాంటి విలనిజాన్ని చూపించగలిగే పాత్రలను మరోసారి ఎందుకు తీసురలేకపోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే కొందరు తమ హావా భావాలతో విలనిజాన్ని చాలా స్ట్రాంగ్ గా పోట్రే చేస్తున్నప్పటికి ఎందుకో అది అంత ఎఫెక్టివ్ గా కుదరడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో విలనిజాన్ని మరింత స్ట్రాంగ్ గా చూపిస్తూ ప్రేక్షకులను మైమరిపింప జేసినప్పుడు మాత్రమే సినిమాలు నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధిస్తాయి. తద్వారా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది... ఎప్పుడైతే విలనిజం స్ట్రాంగ్ గా ఎలివేట్ అవుతుందో అప్పుడే హీరోయిజం కూడా పండుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న సినిమాలు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నాయి. కాబట్టి ఒకప్పటి మాదిరిగా స్ట్రాంగ్ విలన్ లేకపోయినప్పటికి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా చాలా స్టైలిష్ విలన్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు...

Tags:    

Similar News