నేవీ నౌకలు బూడిద రంగులోనే ఎందుకు ఉంటాయి? దీనికి కారణం ఇదే ?

అయితే నీటి అడుగున తిరిగే జలాంతర్గాములు కేవలం కొన్ని సెకన్లలోనే శత్రువు ఏ భాగాన్నైనా ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే, నావికాదళం షిప్‌లు ఎక్కువగా గ్రే కలర్లోనే ఉంటాయి.;

Update: 2025-06-02 14:30 GMT

సముద్రం చాలా విశాలమైనది. అది తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. వాటిలో ముఖ్యమైనవి నౌకాదళం షిప్‌లు (నౌకలు), జలాంతర్గాములు (సబ్‌మెరైన్‌లు). షిప్‌లు సముద్ర ఉపరితలంపై ఉండి శత్రువులపై నిఘా ఉంచుతాయి. అయితే నీటి అడుగున తిరిగే జలాంతర్గాములు కేవలం కొన్ని సెకన్లలోనే శత్రువు ఏ భాగాన్నైనా ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే, నావికాదళం షిప్‌లు ఎక్కువగా గ్రే కలర్లోనే ఉంటాయి. అసలు నావికాదళ నౌకలు గ్రే కలర్లోనే ఎందుకు ఉంటాయి ? వాటిని అలా తయారు చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో వివరంగా తెలుసుకుందాం.

గ్రే కలర్ వెనుక ఉన్న వ్యూహం

నేవీ షిప్‌లు గ్రే కలర్లో ఉండటానికి ప్రధాన కారణం శత్రువుల నుంచి వాటిని రక్షించుకోవడమే. గ్రే కలర్ సముద్రం, ఆకాశం మధ్య ఒక సహజసిద్ధమైన టోన్ (natural tone) లాగా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ, మేఘాలు, సముద్రపు పొగమంచు (sea fog) మధ్య షిప్ బూడిద రంగు కలిసిపోతుంది. ఇలాంటి వాతావరణంలో షిప్‌లు శత్రువులకు దూరంగా ఉన్నప్పుడు సులభంగా కనిపించవు. తెల్లని లేదా మెరిసే రంగులతో పోలిస్తే, గ్రే కలర్ సూర్యరశ్మిని తక్కువగా ప్రతిబింబిస్తుంది (reflects less sunlight). ఈ విధంగా, గ్రే కలర్ ఏ దేశ నావికాదళ నౌకలకైనా శత్రువుల నుంచి సురక్షితంగా ఉండటానికి సాయపడుతుంది. ఇది ఒక రకమైన కామోఫ్లేజ్ (camouflage).

బూడిద రంగు ప్రయోజనాలు

శత్రువుల నుంచి రక్షణతో పాటు, గ్రే రంగుకు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బూడిద రంగుపై దుమ్ము, తుప్పు (rust), ఉప్పు మరకలు (salt stains) వంటివి తక్కువగా కనిపిస్తాయి. దీని కారణంగా, వాటిని తరచుగా శుభ్రం చేయవలసిన అవసరం ఉండదు. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ఇది ఇతర రంగుల కంటే తక్కువ వేడిని గ్రహిస్తుంది (absorbs less heat). దీనివల్ల ఓడ లోపల చల్లగా ఉంటుంది, ఇది సిబ్బందికి సౌకర్యంగా ఉంటుంది. ఈ రంగు ప్రపంచవ్యాప్తంగా నావికాదళాలన్నీ ఓ సాంప్రదాయకంగా వాడుతున్నాయి.

కొన్ని ఆకుపచ్చ రంగులో ఎందుకు?

నేవీ షిప్‌లతో పాటు, ఉత్తర కొరియా, ఇరాన్, ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాలలో జలాంతర్గాములను కూడా ఆకుపచ్చ రంగులో పెయింట్ చేస్తారు. చాలా దేశాలలో జలాంతర్గాములు నలుపు రంగులో ఉన్నప్పటికీ, ఈ దేశాలు వాటిని ఆకుపచ్చ రంగులో ఉంచడం ద్వారా శత్రువులను మోసగించడానికి ప్రయత్నిస్తాయి. ఇది సముద్రపు పాచి, మొక్కలు ఎక్కువగా ఉండే తీర ప్రాంత నీటిలో జలాంతర్గాములను మరింత సహజంగా కనిపించేలా చేస్తుంది. తద్వారా శత్రువుల నిఘా నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News