జయసుధ వల్ల ఏమిటి ఉపయోగం ?

వీళ్ళని చూసి పార్టీలకు పడే ఓట్లు కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఈ విషయం గతం లోనే చాలాసార్లు రుజువైంది.

Update: 2023-08-03 05:46 GMT

సినీనటి, మాజీ ఎంఎల్ఏ జయసుధ బీజేపీ లో చేరారు. ఆమె కాషాయ కండువా కప్పుకోగానే జయసుధ వల్ల బీజేపీకి ఏమిటి ఉపయోగమనే చర్చ మొదలైంది. నిజానికి జయసుధనే కాదు ఏ సెలబ్రిటీ వల్ల ఏ పార్టీకి పెద్దగా ఉపయోగం ఉండదు. షోకేసుల్లో బొమ్మలాగ ఉండటం తప్ప వీళ్ళు పార్టీలకు చేసేదేమీ ఉండదు. వీళ్ళని చూసి పార్టీలకు పడే ఓట్లు కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఈ విషయం గతం లోనే చాలాసార్లు రుజువైంది.

సెలబ్రిటీలతో సమస్య ఏమిటంటే తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. తమ వల్ల పార్టీల కు జనాల్లో ఇమేజి పెరిగిపోతోందని, ఓట్లు పడుతున్నాయనే భ్రమల్లో ఉంటారు. వీళ్ళకు ప్రాధాన్యత దక్కకపోతే అలుగుతారు. వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా ఏదైనా కార్యక్రమాన్ని చేయమంటే చేయలేరు. ఇపుడు బీజేపీ లోనే ఉన్న విజయశాంతి పరిస్ధితి ఇలాగే తయారైంది. ఏదోరోజు విజయశాంతి పార్టీని వదిలేస్తారని అగ్రనేతల కు అనుమానాలు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే ముందుజాగ్రత్తగా జయసుధను చేర్చుకున్నది.

సెలబ్రిటీల ని చెప్పి జనాలు ఓట్లేసే రోజులు కూడా ఎప్పుడో పోయాయి. 2009లో జయసుధ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచారంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పుణ్యమే కానీ జయసుధ కెపాసిటితో కాదు. ఎంఎల్ఏ గా ఉన్నపుడు లేదా పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా జయసుధ జనాల్లో పెద్దగా కనిపించిందిలేదు. సెలబ్రిటీలు ఎక్కువ సమయం షూటింగుల్లో ఉండటం వల్ల జనాలతో బాగా గ్యాప్ వచ్చేస్తుంది.

దానివల్లే పార్టీతో కూడా తేడా వచ్చేస్తుంది. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనబడతామంటే కుదరదు. ఈ కారణంతోనే పార్టీల్లో సెలబ్రిటీలు ఫెయిలవుతుంటారు. ఇపుడు బీజేపీలో చేరిన జయసుధ కాంగ్రెస్ లో నుండి టీడీపీ లో చేరారు. ఆ తర్వాత వైసీపీ లో కూడా తిరిగారు. ఇన్నిపార్టీలు ఎందుకు తిరిగారంటే ఈమెను ఏ పార్టీ పట్టించుకోకపోవటమే. జయసుధే కాదు మోహన్ బాబు, రాజశేఖర్ దంపతులు ఎవరితో అయినా ఇదే సమస్య. చూద్దాం రాబోయే ఎన్నికల్లో జయసుధ వల్ల బీజేపీకి ఏమాత్రం మైలేజి వస్తుందో.

Tags:    

Similar News