వివేకా కేసు సంగతి అంతేనా ?

మాజీ మంత్రి ఆయన. ఘనమైన రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వారు. ఆయన అన్నయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా జనం మెప్పు పొందారు.;

Update: 2025-08-05 17:32 GMT

మాజీ మంత్రి ఆయన. ఘనమైన రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన వారు. ఆయన అన్నయ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా జనం మెప్పు పొందారు. ఆయన అనుంగు సోదరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేసిన ఆయన ఎవరో కాదు వైఎస్ వివేకానందరెడ్డి. ఆయనకు అజాత శత్రువు అని పేరు ఆయన జనంతో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ మమేకం అయిన వారు అటువంటి సౌమ్యుడు దారుణ హత్యకు గురి అయ్యారు అంటే అంతా విస్తుబోయారు.

ఆరున్నరేళ్ళుగా సాగుతూ :

వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న దారుణ హత్యకు గురి అయ్యారు పులివెందులలో తన ఇంట్లో ఆయన హత్య గావించబడ్డారు. ఇప్పటికి ఆరున్నరేళ్ళు అయింది. ఈ హత్య కేసులో అసలైన నిందితులు ఎవరో ఇప్పటిదాకా తెలియలేదు. దీని మీద ముందు స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. తరువాత వివేకా కుమార్తె సునీత కోరిక మేరకు కోర్టు ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని సూచించింది. దాంతో సీబీఐ అనేక ఏళ్ళుగా దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసు అలా ఏళ్ళూ పూళ్ళూ సాగుతూనే ఉంది కానీ నిందితులు ఎవరు అన్నది మాత్రం తేలలేదు.

ఇంతలో ముగింపు మాట :

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టుకు సీబీఐ ఈ కేసులో తమ విచారణ ముగిసిందని ప్రకటించింది. కోర్టు ఏదైనా ఆదేశిస్తే తాము ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పేర్కొంది. తమ శాఖాపరమైన దర్యాప్తు అయితే ముగిసినట్లే అని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం గా మారిన వివేకా హత్య కేసుని ప్రతిష్టాత్మకమైన దర్యాప్తు సంస్థ సీబీఐ టేకప్ చేసింది. అయితే సీబీఐ ఈ కేసులో విచారణ పూర్తి అయింది అని చెప్పడం వరకూ ఓకే కానీ ఫలితం ఏమిటి అన్నదే చర్చగా ఉంది.

ఎవరికి దోషిగా తేల్చినట్లు :

ఈ కేసు విచారణ ముగిసిందని సీబీఐ చెబుతోంది. మరి వివేకా హత్యకు పాల్పడిన వారు ఎవరు సూత్రధారులు పాత్రధారులు ఎవరు అన్నది అందరిలో ఉన్న చర్చ. మరి దానికి సీబీఐ నుంచి జవాబు వచ్చిందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఈ కేసులో అసలైన నేరస్తులు ఎవరూ ఏమిటీ అన్నది తేల్చకుండానే కేసులో విచారణ అయిపోయింది అని సీబీఐ చెప్పడం మీద అయితే హాట్ డిస్కషన్ అయితే సాగుతోంది. సుప్రీం ఆదేశిస్తే విచారణ చేస్తామని చెప్పడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి అని కూడా అంతా చర్చిస్తున్నారు.

వివరాలు చెప్పాలి కదా :

ఒక సీరియస్ కేసు ఎంతో కీలకమైన కేసులో విచారణ పూర్తి అయితే ఫలానా వారు దోషులు అని ప్రకటించాలి కదా లేదా ఫలానా కారణాల వల్ల ఈ హత్య జరిగింది అని తేటతెల్లం చేయాలి కదా అన్నది కూడా ప్రజలలో సాగుతున్న చర్చ. సీబీఐ విచారణ పరిపూర్తి అయిందని చెప్పడంతో ఈ కేసులో సీబీఐ సాధించింది ఏమిటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఎంతో హై ప్రొఫైల్ కేసుగా ఉన్న వివేకా హత్య కేసులో సీబీఐ ఈ విధంగా చెప్పడంతో ఈ కేసులో తేల్చినది ఏమిటి అనే అనుకుంటున్నారు. చూడాలి మరి దీని మీద పురోగతి ఏమి ఉంటుందో సుప్రీంకోర్టు ఈ కేసులో సీబీఐని ఏమని ఆదేశిస్తుందో.

Tags:    

Similar News