విశాఖ మెట్రోకి ఎల్ అండ్ టీ దెబ్బ

ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఎంతవరకూ అసలు దీనిని టేకప్ చేస్తే వయబిలిటీ అన్నది సాధ్యమేనా అన్నది బిడ్డర్లకు అనుమానంగా ఉందని అధికార వర్గాలలోనే చర్చగా సాగుతోంది.;

Update: 2025-09-16 02:45 GMT

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కధ దశాబ్దం నాటిది. అలా సాగుతూ ఈ రోజుకు డీపీఆర్ దశ దాటి టెండర్ల ప్రక్రియ దాకా వచ్చింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానిస్తే ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపించకపోవడం ఆలోచనలలో పడేస్తోంది దాంతో టెండర్ల ప్రక్రియ గడువుని అయితే అక్టోబర్ 7 వరకూ పెంచారు. అయితే బిడ్డర్లు ఎందుకు ఈ ప్రాజెక్ట్ కోసం ముందుకు రావడం లేదు అని అంతా తర్కించుకుంటున్నారు.

ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఎంతవరకూ అసలు దీనిని టేకప్ చేస్తే వయబిలిటీ అన్నది సాధ్యమేనా అన్నది బిడ్డర్లకు అనుమానంగా ఉందని అధికార వర్గాలలోనే చర్చగా సాగుతోంది. తొలి దశలో చేపట్టాలని భావిస్తున్న విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కి సంబంధించిన అంచనా వ్యయం చూస్తే ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలుగా ఉంది. దాంతో కూడా బిడ్డర్లు ముందుకు రావడం లేదని అంటున్నారు.

సరిగ్గా ఇదే సమయంలోనే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి తమను తప్పించమని తాము నిర్వహించలేమని ఎల్ అండ్ టీ కేంద్రానికి లేఖ రాయడం కూడా విశాఖ మెట్రో మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ నాలుగైదు లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రో నిర్వహణనే భారంగా ఎల్ అండ్ టీ భావిస్తే విశాఖ మెట్రో ప్రాజెక్ట్ విషయంలో చాలానే ఆలోచించాలని అంటున్నారు.

విశాఖలో ట్రాఫిక్ సమస్య ఉంది కానీ మరీ భయంకరంగా అయితే లేదు. ప్రధానంగా కొన్ని సమయాలలోనే అది ఉంటుంది. పీక్ హవర్స్ దాటితే రోడ్లు మామూలుగానే ఉంటాయి. రెగ్యులర్ గా రోజంతా సాగే ఫ్లోటింగ్ పాపులేషన్ పెద్దగా కనిపించదని చెబుతారు. దాంతో పాటుగా ప్రజా రవాణాగా బస్సులు ఇతర సాధనాలు ఉండనే ఉన్నాయి.

ఈ నేపధ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ద్వారా అనుకున్న విధంగా జనాల మొగ్గు ఉండకపోతే ఇబ్బంది అని భావిస్తున్నారు అంటున్నారు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నారు. 2050 నాటికి విశాఖ జనాభా యాభై నుంచి అరవై లక్షలకు చేరువ అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఆనాటికి మెగా సిటీలలో విశాఖ మరింత ముందు స్థానంలో ఉంటుందని చెబుతున్నారు. అయితే మరో పాతికేళ్ళ కాలం నాటికి మెట్రో జోరు అందుకుని కూత బిగ్ సౌండ్ చేస్తుందని ప్రస్తుతానికి అయితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా అన్న డౌట్ అయితే ఉందిట. అందుకే బిడ్డర్లు ఆలోచనలో పడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News