లవ్ మ్యారేజ్ చేసుకుందని మనమడ్ని దత్తత ఇచ్చేసిన తాత

ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు బిడ్డ విషయంలో ఒక తండ్రి వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.;

Update: 2025-06-30 11:30 GMT

ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురు బిడ్డ విషయంలో ఒక తండ్రి వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం నగర పోలీస్ కమిషనర్ వద్దకు వెళ్లటం.. ఆ వెంటనే స్పందించిన ఆయన.. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీం పుణ్యమా అని.. మూడు గంటల్లోనే దొరికేశాడు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

అరకు ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల దివ్య స్వరూప తమ ప్రాంతానికే చెందిన జాన్ బాబును ప్రేమించింది. తండ్రికి ఇష్టం లేకున్నా ప్రేమ పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లిని మొదట్నించి వ్యతిరేకిస్తున్న దివ్య తండ్రి. పి.శుక్ర..వారిద్దరిని విడదీయటానికి చాలానే ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఆయన పధకాలు ఫలించాయి. మనస్పర్థలతో వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అదే సమయానికి దివ్య స్వరూప ప్రెగ్నెంట్ అయ్యింది.

డెలివరీ కోసం తండ్రి వద్దకు వచ్చింది. విశాఖలోని కేజీహెచ్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పుట్టిన వెంటనే పచ్చ కామెర్లు రావటంతో ఆసుపత్రిలోనే ఉంచానని.. అక్కడే వైద్యం చేయిస్తున్నట్లుగా చెప్పాడు. పలు పత్రాల మీద కుమార్తెతో సంతకాలు తీసుకున్నాడు. మరోవైపు.. పుట్టిన మగబిడ్డను తల్లికి తెలీకుండానే వేరు వారికి దత్తత పేరుతో ఇచ్చేసాడు.

పిల్లాడు పుట్టి రెండు నెలలు అవుతున్నా.. ఆచూకీ లేకపోవటం.. తండ్రి ఏదో ఒక మాట చెప్పటంతో తన బిడ్డ ఆచూకీ కోసం ఆమె విశాఖలోని కంచరపాలెం పోలీసులకు.. అనంతరం నగర కమిషనర్ శంకబ్రత బాగ్చీకి కంప్లైంట్ చేశారు. పీసీ ఆదేశాలతో ఇన్ ఛార్జ్ సీఐ రవికుమార్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. మూడు గంటల విచారణలోనే రెండు నెలలుగా కనిపించకుండా పోయిన పసికందును పోలీసులు ట్రేస్ చేశారు.అనంతరం చిన్నారిని హోంకు తరలించి.. కేసును విచారిస్తున్నారు.

Tags:    

Similar News