విశాఖకు భూకంప ప్రమాద రిస్క్ ఎంత ?
విశాఖ మహా నగరంగా ఏపీలో ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీగా కూడా చెబుతారు. విశాఖకు అందమైన తీర ప్రాంతం ఉంది. కొండలు వెనక ఉన్నాయి.
విశాఖ మహా నగరంగా ఏపీలో ఉంది. సిటీ ఆఫ్ డెస్టినీగా కూడా చెబుతారు. విశాఖకు అందమైన తీర ప్రాంతం ఉంది. కొండలు వెనక ఉన్నాయి. పచ్చదనం కూడా ఉంది. ఇలా ప్రకృతి ఒడిలో పరవశించే విశాఖకు అదే ప్రకృతి నుంచి ముప్పు ఉంటుందా అన్న చర్చ ఎపుడూ జరుగుతూ ఉంటుంది. 2004లో సునామీ వచ్చినపుడు విశాఖ కూడా కొంత వరకూ ప్రభావితం అయింది. అలాగే 2014లో విశాఖను హుదూద్ తుఫాన్ గట్టిగానే అల్లల్లాడించింది. తరచూ కాకపోయినా అపుడపుడు విశాఖను భూ ప్రకంపనలు కొంత అలజడిని రేపుతూ ఉంటాయి. మరి ఇంతకీ విశాఖ సేఫ్ జోన్ లో ఉందా విశాఖకు భూకంప ప్రమాద రిస్క్ ఎంత అన్న ప్రశ్నలు కూడా అందరిలో వస్తూంటాయి.
రిస్క్ తక్కువగానే అంటూ :
అయితే దీనికి నిపుణులు చెప్పే మాట ఒక్కటే. విశాఖ భూకంప ప్రమాదాలకు దూరం అని. తక్కువ రిక్స్ ఉన్న ప్రాంతం అని. అందుకే విశాఖపట్నం సాధారణంగా సురక్షితమైన నగరంగా పరిగణించబడుతోంది అని చెబుతారు. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారికంగానే నిర్ధారించింది అని అంటారు. భూకంప ప్రమాద రిస్క్ జోన్ టూలో విశాఖ ఉంది. అంటే తక్కువ నష్టం కలిగే రిస్క్ జోన్ గా దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వర్గీకరించింది. నగరానికి 0.10 జీ జోన్ గా కేటగిరీ ఇవ్వబడింది. దీని వల్ల ఈ ప్రాంతంలో అధిక తీవ్రత గల భూకంపాలు సంభవించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. విశాఖ తీర ప్రాంతం చాలా స్థిరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్నపాటి భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. భూగర్భ జలాలు తక్కువ లోతులో ఉండటం వంటి స్థానిక కారణాల వల్ల నిర్దిష్ట ప్రాంతాలలో ప్రామాణిక నిర్మాణ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని కూడా నిపుణులు సూచిస్తున్నారు.
విశాఖ నగరం అక్కడ ఉంది :
ఇక విశాఖ నగరం ఒక స్థిరమైన మూలశిలతో కూడిన అంతర ఫలక ప్రాంతంలో ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ తీరప్రాంతంలో అప్పుడప్పుడు చిన్న పాటి నియంత్రించదగిన భూకంప ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతున్నారు. తాజాగా చూస్తే జూలై 12న ఉదయం అయిదు గంటల ప్రాంతంలో బంగాళాఖాతం తీరంలో సంభవించిన 4.5 తీవ్రత గల సంఘటన అని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రకంపనలు భారత వాతావరణ శాఖ నిర్దేశించిన సురక్షిత పరిమితుల్లోనే ఉన్నాయని చెబుతున్నారు అంతే కాదు సాధారణంగా పటిష్టంగా నిర్మించిన ఇళ్లకు తీవ్రమైన నిర్మాణపరమైన ముప్పును ఇవి ఏ మాత్రం కలిగించవు అని అంటున్నారు.
విశాఖలో జరిగిన భూకంప అధ్యయనాలు :
ఇదిలా ఉంటే విశాఖ సముద్ర తీరానికి సమీపంలో ఉండటం భూగర్భ జలాలు తక్కువ లోతులో ఉండటం వల్ల 6.0 ప్లస్ గా ఈ భూకంపాల తీవ్రత పెరగవచ్చని చెబుతున్నారు. అంతే కాదు విశాఖపట్నం భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ ఇళ్లు మౌలిక సదుపాయాలు భూకంపాలను తట్టుకునేలా ఉండేలా చూసుకోవడానికి డెవలపర్లు ప్లానర్లు కఠినమైన జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ భవన మార్గదర్శకాలను పాటించాలని నిపుణులు గట్టిగానే చెబుతున్నారు. అయినప్పటికీ విశాఖ సేఫ్ జోన్ గానే నిర్దారిస్తున్నారు. ఇక జూలై 12న సంభవించిన భూకంప ప్రకంపనలు మాత్రం గతానికి పోలిస్తే ఎక్కువే అని అంటున్నారు. రిక్టర్ స్కేల్ మీద 4.5 గా నమోదు అయింది. ఇది గతంలో కంటే ఎక్కువ నమోదుగా నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా విశాఖ సేఫ్ జోన్ అని ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అంటున్నారు.