• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెళ్లిపీటలెక్కబోతున్న...

పెళ్లిపీటలెక్కబోతున్న వంగవీటి రాధా... వధువు ఎవరంటే...?

| వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని అంటున్నారు. దీంతో... రాధ పెళ్ళి చేసుకోనుంది ఎవరిని అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.

By - Tupaki Desk
Update: 2023-08-16 07:04 GMT

ఏపీ పాలిటిక్స్ లో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై ఆయన అభిమానుల్లో చర్చ నడుస్తుంటుందని.. "అన్న పెళ్లి ఎప్పుడు" అనే మాట వినిపిస్తుంటుందని అంటుంటారు. అయితే ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనున్నారని సమాచారం.

అవును... ప్రస్తుతం ఒక వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని అంటున్నారు. దీంతో... రాధ పెళ్ళి చేసుకోనుంది ఎవరిని అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. అయితే తాజాగా ఈ విషయాలపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.

నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందని తెలుస్తోంది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది.

నర్సాపురానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందని తెలుస్తోంది. ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ జక్కం ఆమ్మాని - బాబ్జీల చిన్న కుమార్తె ఈ జక్కం పుష్పవల్లీ! ఆమెతోనే వంగవీటి రాధాకు వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో... ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. సెప్టెంబర్ 6న వివాహం ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది.

కాగా వంగవీటి రాధా 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారు.

Tags:    
  • Andhrapradesh 
  • Vangaveetiradha 
  • Marriage 
  • Leader 
  • Narsapuram 
  • Girl 
  • Family 
  • Pushpavalli 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS