అవును.. 'వైకుంఠం' టీడీపీని వీడుతున్నారా?

ప్ర‌స్తుతం వైకుంఠం ఏం చేస్తున్నారంటే.. రాజ‌కీయంగా ఆయ‌న‌ను ప‌ట్టించుకునే వారు లేకుండా పోయా రు. ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో నాయ‌కులు ఓడినా.. కేడ‌ర్ బ‌లంగా నిల‌బ‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి.;

Update: 2025-07-13 02:30 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకే ర‌కంగా ఉండ‌వు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న రాజ‌కీయాల‌ను నాయ‌కులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలి. ఎ దుర‌య్యే స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేయాలి. ముఖ్యంగా ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత‌.. అనేది లేకుండా కూడా చేసుకోవాలి. ఇలా చేయ‌క‌పోతే.. మున్ముందు రాజ‌కీయాల్లో ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ త‌ర‌హా ప‌రిణామాల‌ను, ప‌రిస్థితు ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న‌వారు.. మాత్రమే రాజ‌కీయాల్లో ముందున్నారు. లేని వారు క‌నుమ‌రుగ‌య్యారు.

ఇలాంటి జాబితాలో అనంత‌పురం అర్బ‌న్ మాజీ ఎమ్మెల్యే.. టీడీపీనాయ‌కుడు వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి చేరిపోయారు. 2014లో ఒకే ఒక్క‌సారి విజ‌యం ద‌క్కించుకున్న వైకుంఠం ప్ర‌భాక‌ర్ చౌద‌రి.. గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు ఈ జాబితాలో కూడా లేకుండా పోయారు. 2019లో పోటీ చేసినా..అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. సొంత పార్టీ నాయ‌కుల వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు వేయ‌లేక పోవ‌డం వంటి కార‌ణంగా.. వైకుంఠం ప‌రాజ‌యం పాలైన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం వైకుంఠం ఏం చేస్తున్నారంటే.. రాజ‌కీయంగా ఆయ‌న‌ను ప‌ట్టించుకునే వారు లేకుండా పోయారు. ఒక‌ప్పుడు రాజ‌కీయాల్లో నాయ‌కులు ఓడినా.. కేడ‌ర్ బ‌లంగా నిల‌బ‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ, వైకుంఠం విష‌యంలో కేడ‌ర్ కూడా బ‌లంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు దూకుడుగా ముందుకు సాగడం.. జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ‌ర్గాన్ని ఢీ అంటే.. ఢీ అన్న‌ట్టుగా ఎదుర్కొన్న క్ర‌మంలో ఆయ‌న విజ‌యం ముందుకు సాగింది. దీనికి కూట‌మి ప్ర‌భావం కూడా క‌లిసి వ‌చ్చింది.

అయితే.. వైకుంఠం ఇలా.. సొంత పార్టీలో త‌న‌ను వ్య‌తిరేకించే నాయ‌కుల‌కు, ఒక వ‌ర్గానికి.. చెక్ పెట్ట‌లేక పోయారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా.. ధ‌ర్నాలు చేయ‌డం.. జేసీ వ‌ర్గం దూకుడుకు ఆయ‌న‌క‌ళ్లెం వేయ‌లేక ప్ర‌తి విష‌యాన్నీ అధిష్టానం దృష్టికి తీసుకురావ‌డం.. పంచాయతీలు.. వంటివి స్థానికంగా వైకుంఠం ఓటు బ్యాంకును కూడా బ‌దాబ‌ద‌లు చేశాయి. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌పై చేయించిన స‌ర్వేల్లో మైన‌స్ మార్కులు వ‌చ్చాయి. ఇక‌, ఆత‌ర్వాత‌.. వైకుంఠం పార్టీలో ఉన్నా.. కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం నుంచి ఆయ‌న‌కు ఆహ్వానాలు అందుతున్న ద‌రిమిలా.. ప్ర‌స్తుతం ఈయ‌న వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. 

Tags:    

Similar News