ఉషా చేతికి ఉంగరం.. హమ్మయ్య విడిపోవట్లేదు
తెలుగమ్మాయి ఉషా వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడితో విడిపోనుందన్న చర్చకు ఫుల్ స్టాప్ పడే ఘటన చోటు చేసుకుంది.;
తెలుగమ్మాయి ఉషా వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడితో విడిపోనుందన్న చర్చకు ఫుల్ స్టాప్ పడే ఘటన చోటు చేసుకుంది. ఈ మద్యన ఆమె చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్ కనిపించకపోవటంతో పలు సందేహాలు.. అనుమానాలతోపాటు.. వారిద్దరు విడిపోనున్నారన్న చర్చ జరగటం తెలిసిందే. అయితే.. అదేమీ నిజం కాదనన విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామం స్పస్టం చేస్తోంది. ఒక ప్రోగ్రాంలో పాల్గొన్న ఆమె చేతి వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ కనిపించటంతో వీరిద్దరు విడిపోతున్నారన్న చర్చ ముగిసినట్లుగా చెప్పాలి.
తాజాగా ఉపాధ్యక్షుడి కుటుంబం కెంటుకీలో ని అమెరికాలోని సైనికులతోకలిసి థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా దళాలకు జేడీ వాన్స్.. ఉషాలతో పాటు వారి పిల్లలు సైతం కలిసి వడ్డించటం.. సైనికులతో పలు అంశాల్ని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉషా చేతికి రింగు ఉండటంతో ఉపాధ్యక్ష దంపతులు విడిపోతున్నారన్న చర్చకు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
ఇటీవల కాలంలో జేడీ వాన్స్ తీరు.. ఆయన చేసిన వ్యాఖ్యలు.. వ్యవహరించిన తీరుతో ఆయనతో ఉషా వాన్స్ విడిపోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. నార్త్ కరోలినాలో జరిగిన మెరైన్ కోర్ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి వెళ్లిన ఉషా చేతి వేలికి ఎంగేంజ్ మెంట్ రింగ్ లేకపోవటంతో అదో చర్చగా మారింది.
అదే సమయంలో ఉషా మతం మారుతుందని తాను ఆశిస్తున్నట్లుగా జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు.. చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ తో కలిసి ఆయన వేదిక షేర్ చేసుకోవటం.. ఆ టైంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న హగ్ మీడియాలో పెను చర్చకు తెర తీసింది. అనంతరం ఎరికా కిర్క్ హగ్ విషయంలో క్లారిటీ ఇవ్వటం.. తనకు ఎలాంటి ఉద్దేశాలు లేవని చెప్పటం లాంటివి జరిగాయి. రింగ్ లేకుండా ఉషా కనిపించిన వేళ.. ఆమె ప్రతినిధి వాటిని ఖండిస్తూ.. ఆమె ముగ్గురు చిన్నపిల్లల తల్లి అని.. ఆమె క్లీన్ చేయాల్సిన పాత్రలు ఉండిఉంటాయని.. అందుకే రింగ్ తీసేశారేమో అంటూ విషయాన్ని సింఫుల్ గా.. తేలిగ్గా తీసేశారు. తాజాగా ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఉషా కనిపించటంతో.. ఈ దంపతులు ఇద్దరు విడిపోవట్లేదన్న విషయం తేలినట్లైందంటున్నారు.