యూఎస్ వీసా ఉంటే చాలు… ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు!

యూఎస్ వీసా పొందడం అనేది భారతీయ పౌరులకు పెద్ద సవాలు. ఇంటర్వ్యూ నుంచి డాక్యుమెంట్స్ వరకూ ప్రతి దశ కఠినమైనదే.;

Update: 2025-10-23 10:15 GMT

యూఎస్ వీసా పొందడం అనేది భారతీయ పౌరులకు పెద్ద సవాలు. ఇంటర్వ్యూ నుంచి డాక్యుమెంట్స్ వరకూ ప్రతి దశ కఠినమైనదే. కానీ ఒకసారి పాస్‌పోర్ట్‌లో యూఎస్ వీసా స్టాంపింగ్ జరిగితే అది కేవలం అమెరికా ప్రవేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలకు మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.

చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసా కలిగి ఉన్న భారతీయ పౌరులు దాదాపు 20కి పైగా దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ ద్వారా పర్యటించవచ్చు. ఇది యూరోప్‌, దక్షిణ అమెరికా, కరేబియన్ దీవులు, ఆసియా వంటి ప్రాంతాల్లో మీ ప్రయాణాలను సులభతరం చేస్తుంది.

* యూఎస్ వీసా ఉన్నవారికి వీసా లేకుండా అనుమతించే దేశాలు

1. అల్బేనియా

యూఎస్ వీసా ఉంటే 90 రోజుల వరకు వీసా లేకుండానే ప్రవేశించవచ్చు.

2. అర్జెంటీనా

చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసా ఉంటే, 90 రోజుల వరకు పర్యటించవచ్చు.

3. బహమాస్

యూఎస్ వీసా హోల్డర్స్‌కు 90 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ.

4. చిలీ

90 రోజుల వరకు వీసా లేకుండానే పర్యటనకు అనుమతి.

5. మెక్సికో

యూఎస్ వీసా ఉంటే 180 రోజుల వరకు వీసా లేకుండా పర్యటించవచ్చు.

6. పనామా

చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసాతో వీసా అవసరం లేకుండా ప్రవేశం.

7. పెరు

180 రోజుల వరకు వీసా ఫ్రీ పర్యటన.

8. ఫిలిప్పీన్స్

30 రోజుల వీసా ఫ్రీ ఎంట్రీ, కానీ రిటర్న్ టికెట్, వసతి రుజువు అవసరం.

9. బెలిజ్

యూఎస్ వీసా హోల్డర్స్‌కు వీసా లేకుండా ప్రవేశం.

10. కొలంబియా

చెల్లుబాటు అయ్యే యూఎస్ వీసా ఉన్నవారికి వీసా రహిత ప్రవేశం.

11. డొమినికన్ రిపబ్లిక్

యూఎస్ వీసా ఉంటే పర్యాటక ప్రయాణం సులభం.

12. జార్జియా

యూఎస్ వీసా హోల్డర్స్‌కు వీసా అవసరం లేదు.

13. గ్వాటెమాలా, మౌంటెనెగ్రో, నార్త్ మాసిడోనియా, సెర్బియా, సింగపూర్

ఈ దేశాలు కూడా యూఎస్ వీసా కలిగినవారికి వీసా లేకుండానే లేదా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తాయి.

* వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉన్న దేశాలు

అర్మేనియా : 120 రోజుల వరకు వీసా ఆన్ అరైవల్.

బహ్రేన్ : 14 నుంచి 30 రోజుల వరకు వీసా ఆన్ అరైవల్.

ఒమాన్ : 30 రోజుల వరకు వీసా ఆన్ అరైవల్.

సౌదీ అరేబియా : వసతి, నిధుల రుజువుతో 30 రోజుల వరకు పర్యటనకు వీసా ఆన్ అరైవల్.

* కెనడాకు కూడా సులభతరం

యూఎస్ వీసా కలిగి ఉన్న భారతీయ పౌరులు, కెనడా తాత్కాలిక నివాస వీసా మినహాయింపు కింద కూడా సులభంగా ప్రవేశించవచ్చు.

యూఎస్ వీసా అనేది కేవలం అమెరికా ప్రవేశానికి మాత్రమే కాదు, ప్రపంచంలోని 20కి పైగా దేశాల తలుపులు తెరిచే “గోల్డెన్ పాస్” లాంటిది. అందుకే యూఎస్ వీసా స్టాంపింగ్ కోసం వేలాది మంది ప్రతి సంవత్సరం క్యూలో నిలబడతారు. ఒకసారి దాన్ని పొందితే, మీ పాస్‌పోర్ట్ విలువ గణనీయంగా పెరుగుతుంది.

Tags:    

Similar News