మన మధ్యే ఏలియన్స్ తిరుగుతున్నారు.. అమెరికా ప్రభుత్వ వ్యంగ్య ప్రచారం వైరల్

అమెరికా అంతర్గత భద్రతా విభాగం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. ఈ విదేశీయులు ఎక్కడో దాక్కోలేదు.

Update: 2026-05-29 06:52 GMT

దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమాల్లో ఏరియా-51 కథల్లో మనం చూసిన 'ఏలియన్స్' అంటే ఆకాశం నుంచి ఊడిపడే పచ్చటి వింత జీవులు, ఎగిరే పళ్లాలు అనే భావన అందరిలోనూ బలంగా నాటుకుపోయింది. ప్రపంచమంతా ఇంకా అంతరిక్షంలో జీవం కోసం వెతుకుతుంటే... అమెరికా ప్రభుత్వం మాత్రం ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. తాము వెతుకుతున్న ఏలియన్స్ అంతరిక్షం నుంచి వచ్చిన వారు కాదు... మెక్సికో సరిహద్దు దాటి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారులని స్పష్టం చేసింది. నిజం ఎక్కడో విశ్వంలో లేదు, అది ఇక్కడే మన మధ్యే ఉంది అంటూ అమెరికా వీధుల్లోనే అసలైన 'ఏలియన్స్' సంచరిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

మన మధ్యే ఉన్నారు... కానీ వారు ఇక్కడి వారు కాదు..

అమెరికా అంతర్గత భద్రతా విభాగం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం.. ఈ విదేశీయులు ఎక్కడో దాక్కోలేదు. వారు మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయారు. మీతో పాటు బస్సుల్లో ప్రయాణిస్తూ, మీ పిల్లల స్కూల్స్ దగ్గర, లేదా సూపర్ మార్కెట్లలో మీ పక్కనే నిలబడి షాపింగ్ చేస్తూ ఉండొచ్చు చూడటానికి మనలాగే ఉన్నా... ఒకే ఒక్క చిన్న తేడా, వారు ఈ దేశ చట్టబద్ధమైన పౌరులు కారు. చట్ట వ్యతిరేకంగా సరిహద్దులు దాటి వచ్చినవారే.

సంచలన గణాంకాలు: 'రిపోర్ట్ సస్పిషస్ ఏలియన్' మిషన్

అమెరికా ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను ఏరిపారేయడానికి భారీ ఆపరేషన్‌ను ప్రారంభించింది.

యూఎఫ్.ఓల కోసం చూసేవారికి నిరాశే!

ఈ ప్రకటనతో ఏరియా-51 రహస్యాల గురించి.. ఆకాశంలో ఎగిరే వింత వస్తువుల గురించి పరిశోధనలు చేసే స్పేస్ ప్రేమికులకు తీవ్ర నిరాశే ఎదురైందని చెప్పాలి. గ్రహాంతరవాసులు వస్తారని ఎదురుచూసే వారికి అమెరికా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే... ప్రస్తుతానికి ఆకాశం నుంచి వచ్చే ముప్పేమీ లేదు.. కానీ భూమి మీద సరిహద్దుల ద్వారా వచ్చే ముప్పును మాత్రం అరికట్టాల్సిందే.

ప్రభుత్వ హెచ్చరిక

మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించే "ఏలియన్" తారసపడితే... మొదట అతను నిజంగా అంగారక గ్రహం నుంచి వచ్చాడా? లేక మెక్సికో సరిహద్దుల నుంచి వచ్చాడా? అనేది సరిచూసుకోవాలని.. అనుమానం వస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని అంతర్గత భద్రతా సంస్థలు కోరుతున్నాయి.

ప్రపంచ దేశాలన్నీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో లాగా స్పేస్ ఏలియన్స్ కోసం టెలిస్కోప్‌లు పట్టుకుని ఆకాశం వైపు చూస్తుంటే.. అమెరికా మాత్రం తన సొంత వీధుల్లో, నగరాల్లో సంచరిస్తున్న అక్రమ ఏలియన్లను ఏరివేసే పనిలో పడింది. ఈ సరిహద్దు సంక్షోభం అమెరికా రాజకీయాలను, భద్రతను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Tags:    

Similar News