హురున్ రిపోర్టులో అనంత్ అంబానీని దాటేసిన 22 ఏళ్ల కుర్రకారు
దేశ ఆర్థిక వ్యవస్థపై తమదైన ముద్ర వేసిన ప్రముఖులకు సంబంధించిన ఒక జాబితా తాజాగా విడుదలైంది. ఈ నివేదికను అవెండస్ వెల్త్ హురున్ ఇండియా విడుదల చేసింది.;
దేశ ఆర్థిక వ్యవస్థపై తమదైన ముద్ర వేసిన ప్రముఖులకు సంబంధించిన ఒక జాబితా తాజాగా విడుదలైంది. ఈ నివేదికను అవెండస్ వెల్త్ హురున్ ఇండియా విడుదల చేసింది. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దేశంలో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చేపే వారెవరు? అన్న ప్రశ్నకు సదరు రిపోర్టు సమాధానం ఇచ్చేసింది. అందులో మొదటి స్థానంలో గ్రోసరీ.. ఆహార డెలివరీ సంస్థ జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా.. అదితో పలిచాలు తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ ఇద్దరి వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. ఈ జాబితాలో స్థానాన్నిదక్కించుకున్న వారిని చూస్తే.. ఏవీఆర్ స్వర్ణమహల్ జువెలర్స్ కుచెందిన ఏవీఆర్ శ్రీ స్మరణ్. జెనరిక్ ఆధార్ అర్జున్ దేశ్ పాండే.. విజయానంద ట్రావెల్స్ కు చెందిన శివ సంకేశ్వర్.. దిగంతారా కు చెందిన రాహుల్ రావత్.. ఆర్ ఎంజెడ్ బోస్టన్ కు చెందిన మిహిర్ మెండాలు ఉన్నారు.
అన్నింటికంటే సర్ ప్రైజ్ అంశం ఏమంటే.. దేశ కుబేరుడు..ఆస్తుల జాబితాలో టాప్ స్థానంలో ఉండే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి తెలిసిందే. ఆయన కుమారుడు అనంత్ అంబానీ రేస్ లో పదకొండో స్థానంలో నిలిచారు. అనంత్ అంబానీ జియో ప్లాట్ ఫామ్స్ కింద పదకొండో స్థానంలో నిలవగా.. మరో దేశ కుబేరుడు గౌతమ్ అదానీ వారసుడు సాగర్ అదానీ జాబితాలో పద్నాలుగో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కించుకున్నది నెక్ట్స్ వేవ్ సహ వ్యవస్థాపకులు శశాంక్ గుజ్జుల.. అనుపమ్ లు చోటు దక్కించుకున్నారు. మరో క్విక్కామర్స్ సంస్థ స్విష్ వ్యవస్థాపకులు ఉజ్వల్ సుకేజా.. అనికేత్ షాలు ఉన్నారు.
ఇక..ఈ జాబితాలో చోటు దక్కించుకున్న పిన్న మహిళగా ఆప్ట్రా స్కాన్ కు చెందిన 28 ఏళ్ల దేవికా ఘోలప్ నిలిచారు. మొత్తం 79 మందితో రూపొందించిన ఈ జాబితాలో ఎన్ కోర్ హెల్త్ కేర్ కు చెందిన రాధికా మర్చంట్.. స్వతంత్రమైక్రోఫిన్ అనన్య బిర్లా.. పిక్సిస్ కు చెందిన వ్రశాలీ ప్రసాద్.. ఫాక్స్ టేల్ కు చెందిన రొమితా మజుందార్ లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి నగరాల్ని చూస్తే.. 15 మంది వ్యాపారవేత్తలతో ముంబయి టాప్ లో నిలవటం ద్వారా దేశ ఆర్థిక రాజధాని అన్న మాటకు అతికినట్లుగా జాబితా ఉందని చెప్పాలి.