'స్త్రీ' అనే పదానికి ఇదే చట్టపరమైన నిర్వచనం... సుప్రీం సంచలనం!
అవును... ‘స్త్రీ’ అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని వెల్లడిస్తూ తాజాగా యూకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.;
సమానత్వ చట్టాలు ఎలా వర్తింపజేయబడతాయనే దానిపై తీవ్ర పరిణామాలు ఉన్న కేసులో.. యునైటెడ్ కింగ్ డమ్ అత్యున్నత న్యాయస్థానం "స్త్రీ" అనే పదానికి చట్టపరమైన నిర్వచనం తెలిపింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే లింగపరంగా "స్త్రీ"గా గుర్తింపు దక్కుతుందని తెలిపింది.
అవును... ‘స్త్రీ’ అనే పదానికి చట్టపరమైన నిర్వచనాన్ని వెల్లడిస్తూ తాజాగా యూకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా... అమ్మాయిలుగా పుట్టినవారికి మాత్రమే చట్టపరంగా, లింగపరంగా ‘స్త్రీ’గా గుర్తింపు దక్కుతుందని తెలిపింది. ‘స్త్రీ’కి చట్టపరమైన నిర్వచనం... జీవసంబంధమైన స్త్రీ, జీవసంబంధమైన లైంగికత అని ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది!
2018లో స్కాట్లాండ్ లోని ఓ ప్రచారకర్తల బృందం ఈ సవాలును ముందుకు తెచ్చింది. దీంతో.. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ తీర్పు వెల్లడైంది. ఇందులో భాగంగా... సమానత్వ చట్టం - 2010 ప్రకారం "స్త్రీ", "లింగం" అనే పదాలు పుట్టుకతో అమ్మాయిలుగా పుట్టినవారిని, పుట్టుకతో ఏ లింగానికి చెందినవారు అనే విషయాలను మాత్రమే సూచిస్తాయని సుప్రీం స్పష్టం చేసింది.
వాస్తవానికి లింగ ధృవీకరణ గుర్తింపు పత్రం (జీ.ఆర్.సీ) ఉన్న ట్రాన్స్ ఉమెన్ చట్టబద్ధంగా ‘స్త్రీ’ అని, అందువల్ల వారికి కూడా అదే చట్టపరమైన రక్షణలు కల్పించాలని స్కాట్లాండ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే... లింగమార్పిడి చేయించుకున్నంత మాత్రాన్న ఆమె చట్టపరంగా మహిళ కాదని సుప్రీం స్పష్టం చేస్తూ.. ఇదే సమయంలో.. ట్రాన్స్ జెండర్ లకు రక్షణ ఉంటుందని తెలిపింది.
అయితే ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న వాదన, ఆ మేరకు తీసుకుంటున్న నిర్ణయాలకు ఈ తీర్పు పరోక్షంగా మద్దతు కలిగించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ఎల్.జీ.బీ.టీ.క్యూ. ఛారిటీ స్టోన్ వాల్.. తాజా సుప్రీం తీర్పు ట్రాన్స్ కమ్యునిటీకి చాలా ఆందోళన కలిగించేదని అన్నారు.
కాగా... యూకే ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023లో లైంగిక గుర్తింపు ఆధారంగా ద్వేషపూరిత నేరాలు సుమారు 112% పెరిగినట్లు చెబుతున్నారు. అదే విధంగా.. అదే ఏడది సెంట్రల్ ఇంగ్లాండ్ లోని ఓ పార్కులో బ్రియానా ఘే అనే యువ ట్రాన్స్ అమ్మాయిని ఇద్దరు స్కూలు పిల్లలు హత్య చేశారు!