శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి మరో ఛాన్స్.. అదెలానంటే?
వైకుంఠ ఏకాదశి వేళ.. దేవాలయాలకు వెళ్లటం చాలామంది చేస్తారు. ఇలాంటి విశిష్ట రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు.;
వైకుంఠ ఏకాదశి వేళ.. దేవాలయాలకు వెళ్లటం చాలామంది చేస్తారు. ఇలాంటి విశిష్ట రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ.. రద్దు తీవ్రంగా ఉండటంతో అందరికి స్వామి దర్శనం సాధ్యం కాదు. ఈసారి రద్దీని నియంత్రించేందుకు వీలుగా గత నెల 27న రిజిస్ట్రేషన్ మొదలు పెట్టి.. డిసెంబరు ఒకటిన సాయంత్రం ఐదు గంటల వేళలో ముగించారు. ఇందుకోసం భారీ ఎత్తున భక్తులు తమ పేర్లను నిమోదు చేసుకోవటం గమనార్హం.
మొత్తం 9.55 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24.05 లక్షల మంది భక్తులు తమ వివరాల్ని సమర్పించి.. వైకుంఠ ద్వార దర్శనం కోసం తమ లక్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎంతమంది దర్శన అవకాశాన్ని సొంతం చేసుకుంటారన్న విషయానికి సంబంధించిన వివరాల్ని ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. లక్కీ డిప్ లో (ఎలక్ట్రానిక్ పద్దతిలో) ఎంపికైన భక్తుల వివరాల్ని సెల్ ఫోన్ కు మెసేజ్ రూపంలో పంపుతారు.
అందులోని లింక్ ఓపెన్ చేసుకొని ఉచిత టోకోన్లు భక్తులు డౌన్ లోడ్ చేసుకునే వీలుంది. అయితే.. ఈ లక్కీ డిప్ లో ఎంపిక కాని వారి పరిస్థితేంటి? కొత్తగా దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహం ఉంటే మరో అవకాశం లేదా? అన్న సందేహాలు రావొచ్చు. దానికో మార్గం ఉంది. ఈ నెల ఐదున ఆన్ లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు.. శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. టీటీడీ యాప్ ద్వారా, వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకునే వీలుంది. డిసెంబరు 30న 57 వేలు.. 31న 64వేలు.. జనవరి 1న 55 వేల టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి. మిగిలిన ఏడు రోజులు ఎలాంటి టోకెన్లు లేని భక్తుల్ని నేరుగా అనుమతులు ఇస్తారు.
ఇవి కాకుండా రూ.300 చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనాల కోసం 15 వేలు.. వెయ్యి టికెట్లు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నాయి. దీనికి సంబంధించిన కోటాను డిసెంబరు 5న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మరోసారి లక్ కోసం ప్రయత్నిస్తే సరి.