సీరియస్ మేటర్... 'భార్యభర్తల మధ్య ట్రంప్ మద్యవర్తిత్వం వహించరు'!
ప్రధాన అంతర్జాతీయ సంఘర్షణలకు, యుద్ధాలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నానని, ముందుముందు వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే;
ప్రధాన అంతర్జాతీయ సంఘర్షణలకు, యుద్ధాలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తున్నానని, ముందుముందు వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సమస్యను తెరవెనుక మీరే సృష్టించి, తెరముందు మీరే ముగించి, మీకుమీరే చప్పట్లు కొట్టుకుంటున్నారనే కామెంట్లూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పై వినిపిస్తుంటాయి.. అది వేరే విషయం!
ఈ క్రమంలో... భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం విషయంలో అమెరికా పాత్ర లేదని, ట్రంప్ ప్రమేయం లేదని ప్రధాని నరేంద్ర మోడీ పబ్లిక్ గా చెప్పినా... ఆ ఇరు దేశాల మధ్య యుద్ధం.. కాదు కాదు.. అణుయుద్ధం జరగకుండా తానే ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఇటీవల మోడీ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లే ఏకీభవించి.. మళ్లీ మొదటికొచ్చారు.
ఇందులో భాగంగా... తాను వరుస ఫోన్ కాల్స్ తో యుద్ధం ముగించానని.. మీరు ఒకరితో ఒకరు పోరాడితే తాము ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకోమని భారత్, పాక్ లకు తేల్చిచెప్పానని అన్నారు. అనంతరం మోడీ తనకు గొప్ప స్నేహితుడని.. పాక్ జనరల్ ఆకట్టుకునే వ్యక్తి అని చెప్పిన ట్రంప్.. వారు కూడా వాణిజ్య ఒప్పందమే కావాలని చెప్పారని పేర్కొన్నారు.
ఇక తాజాగా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో తాను కీలక పాత్ర పోషించానని ట్రంప్ పేర్కొన్నారు. వ్యక్తిగత దౌత్యం, బలమైన ఆర్థిక పరపతి తన విజయాలకు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మీక్స్, ట్రోల్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
అవును... ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘర్షణ వచ్చినా దాన్ని తానే ఆపుతున్నానని, తాను 21వ శతాబ్ధపు శాంతి దూతనని, ఇంత చేసినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని సన్నాయినొక్కులు నొక్కుతూ వైరాగ్యపు మాటలు మాట్లాడుతున్న ట్రంప్... భార్యభర్తల గొడవల్లో మాత్రం మధ్యవర్తిత్వం చేయరంట. ఇది అయన చెప్పలేదు.. మీమ్స్ చెబుతున్నాయి!
ఇందులో భాగంగా... “వివాహిత జంటల మధ్య వైవాహిక వివాదాలను పరిష్కరించమని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు ఫ్రాంక్ కాల్స్ వస్తున్నట్లు చూపిస్తుంది. దీంతో... కాస్త కోపంగా మారిన ట్రంప్... "నా నంబర్ మీకు ఎవరు ఇచ్చారు?.. నేను భార్యాభర్తల మధ్య మధ్యవర్తిత్వం వహించను!" అని అన్నారు! దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మీమ్ వైరల్ గా మారింది.