విజయ్‌ని వదులుకున్న కొడుకు

తమిళనాట ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌కి.. ఎన్నికల ముంగిట అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు.;

Update: 2026-03-12 10:16 GMT

తమిళనాట ఎన్నో అంచనాల మధ్య రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తమిళ అగ్ర కథానాయకుడు విజయ్‌కి.. ఎన్నికల ముంగిట అంత అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆత్మరక్షణలో పడి.. ఆ తర్వాత కోలుకున్న ఆయనకు.. ఇటీవల వ్యక్తిగత జీవితంలో వివాదాలు ఊపిరి సలపనివ్వడం లేదు. ఎన్నికలు సమీపిస్తుండగా.. భార్య సంగీత ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఆమె చేసిన అక్రమ సంబంధం ఆరోపణలను నిజం చేస్తూ విజయ్.. త్రిషతో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరయ్యాడు.

విజయ్ జనాలకు ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో కానీ.. ఇది అంతిమంగా బూమరాంగ్ అయినట్లే కనిపిస్తోంది. విజయ్, త్రిష ఇద్దరి మీదా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో సొంత కొడుకే విజయ్‌కి పెద్ద షాకిచ్చాడు. అతడి పేరు జేసన్ సంజయ్. పేరు మధ్యలో విజయ్ పేరును సూచించేలా ఇన్షియల్‌గా ‘వి’ని పెట్టుకున్నాడు ఇంత కాలం.

కానీ ఇప్పుడు తన పేరు నుంచి ‘వి’ని తీసేశాడట. తల్లి సంగీత పేరు కలిసొచ్చేలా ‘ఎస్’ అక్షరాన్ని పేరులో చేర్చుకున్నాడట. విడాకుల వ్యవహారంలో తాను తల్లి వైపే అని అతను సంకేతాలు ఇచ్చేశాడు. జేసన్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరో అవుతాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అతను అందరినీ ఆశ్చర్యపరుస్తూ దర్శకుడయ్యాడు.

సందీప్ కిషన్ హీరోగా ‘సిగ్మా’ అనే సినిమా తీస్తున్నాడు. కొడుకు దర్శకుడిగా పరిచయం అవుతున్నా.. అతడికి విజయ్ ఎలాంటి ఓపెన్ సపోర్ట్ ఇవ్వలేదు. జేసన్‌కు అవకాశం రావడం వెనుక విజయ్ ఫ్యాక్టర్ ఉందో ఏమో తెలియదు కానీ.. అతను కూడా తండ్రి పేరును వాడట్లేదు. ఇప్పుడు విజయ్ ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో ఇన్షియల్ మార్చుకోవడంతో కొడుకే తండ్రిని దూరం పెట్టడం జనాలకు ప్రతికూల సంకేతాలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News