పీస్ డీల్‌పై ఇరాన్, అమెరికా సంతకాలు.. యుద్ధానికి ఇప్పటికీ బ్రేక్..
నిన్నటివరకు క్షిపణులు, డ్రోన్లు, ఆంక్షల సైరన్లతో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేసిన అమెరికా-ఇరాన్ జంట.. ఇప్పుడు ఒక్కసారిగా "ఫైట్ క్లబ్" నుంచి లైన్ దాటి "పీస్ క్లబ్"లో చేరిపోయింది.
నిన్నటివరకు క్షిపణులు, డ్రోన్లు, ఆంక్షల సైరన్లతో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేసిన అమెరికా-ఇరాన్ జంట.. ఇప్పుడు ఒక్కసారిగా "ఫైట్ క్లబ్" నుంచి లైన్ దాటి "పీస్ క్లబ్"లో చేరిపోయింది. "నువ్వా-నేనా" అంటూ మీసాలు తిప్పిన ఇరు దేశాలు.. ఇప్పుడు పెన్నులు పట్టి సంతకాలు పెట్టేసరికి అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులకు మైండ్ బ్లాంక్ అయింది. వరల్డ్ వార్-3 ఎప్పుడెప్పుడు వస్తుందా అని సోషల్ మీడియాలో పోస్టులు రెడీ చేసుకున్న నెటిజన్లకు ఈ వార్త గట్టి షాకే ఇచ్చింది.
వెర్సైల్స్ ప్యాలెస్‌లో సినిమా క్లైమాక్స్
ఫ్రాన్స్‌లోని చారిత్రాత్మక వెర్సైల్స్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ హై-డ్రామా.. హాలీవుడ్ యాక్షన్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. జీ7 సమావేశం ముగియడం ఆలస్యం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో పెన్ను తీసి డిజిటల్ సంతకం పెట్టేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అంతే స్పీడుగా సైన్ చేసేశారు. అంతకుముందే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ దీనిపై ముద్ర వేయడంతో.. మొత్తానికి ఈ 14 అంశాల సుద్దుల మెమోరాండం అధికారిక రూపం దాల్చింది.
ఇంతకీ డీల్ ఏంటంటే
ఇప్పటివరకు క్షిపణులు, బాంబులు మాట్లాడిన చోట ఇకపై లాయర్లు, దౌత్యవేత్తలు సూట్లు వేసుకుని మాట్లాడుకుంటారు. హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది. చమురు ధరలు తగ్గుతాయి. లెబనాన్ సరిహద్దుల్లో తుపాకులు సైలెంట్ అవుతాయి.
మా యురేనియం మాదే.. ఇరాన్ మార్క్ కండిషన్స్!
శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ఇరాన్ తన పాత అలవాట్లను వదులుకుంటుందని అనుకుంటే పొరపాటే. "శాంతి అంటే మా బలహీనత కాదు బాసూ.. మా యురేనియం మా దగ్గరే ఉంటుంది. కొత్తగా ఆంక్షలు పెట్టడం, మా సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేయడం లాంటి పనులు పెట్టుకోవద్దు" అంటూ అమెరికాకు ముందే గట్టిగా కండిషన్స్ పెట్టింది. "ముందు మీరే బుద్ధిగా ఉండాలి" అంటూ ట్రంప్‌కే ఎదురు క్లాస్ పీకింది ఇరాన్.
మధ్యలో పాకిస్థాన్ క్రెడిట్ గేమ్
ఈ కథలో అసలైన కామెడీ ఎక్కడంటే.. ఈ డీల్‌కు మధ్యవర్తిత్వం వహించానని చెప్పుకుంటున్న పాకిస్థాన్ వేస్తున్న పిల్లిమొగ్గలు. ప్రపంచమంతా యుద్ధం ఆగిపోయిందని ఊపిరి పీల్చుకుంటుంటే, పాకిస్థాన్ మాత్రం దీనికి "ఇస్లామాబాద్ మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్" అని పేరు పెట్టేసి క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడానికి తెగ ఆరాటపడుతోంది. "యుద్ధం ఎవరైనా చేసుకోండి.. శాంతి మాత్రం మా పేరిటే జరగాలి" అన్నట్టుగా ఉంది పాక్ వ్యవహారం.
యుద్ధానికి బ్రేకా? లేక టీ బ్రేకా?
ఏది ఏమైనా రాబోయే 60 రోజుల్లో శాశ్వత శాంతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిన్నటివరకు "ఎవరు ముందుగా బాంబులు వేస్తారు?" అని టెన్షన్ పడ్డ ప్రపంచం.. ఇప్పుడు "ఎవరు ముందుగా ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కుతారు?" అనే కొత్త సస్పెన్స్ థ్రిల్లర్‌ను చూడబోతోంది. ఇది నిజంగానే యుద్ధానికి ఎండ్ కార్డా లేక వచ్చే పార్ట్ కోసం తీసుకున్న చిన్న ఇంటర్వెల్ బ్రేకా అనేది కాలమే నిర్ణయించాలి!