ఇక నో ఢిపెన్స్... ట్రంప్ కొత్త నిర్ణయం : కారణమిదే..?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశాలయ్యాయి.;
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధానాలపై తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశాలయ్యాయి. ఆయన రాజకీయ ధోరణి దూకుడుగా ఉండటం వల్ల దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా ప్రభావం చూపింది. తాజాగా ట్రంప్ తీసుకున్న మరో కీలక నిర్ణయం మళ్లీ వివాదాలకు దారి తీస్తోంది. రక్షణ శాఖకు ఉన్న ప్రస్తుత పేరు స్థానంలో, ఒకప్పుడు వినియోగించిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ అనే పాత పేరును మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.
యుద్ధ విభాగం నుంచి మార్పులు..
అమెరికా పాలనా వ్యవస్థలో రక్షణ శాఖకు విశేషమైన చరిత్ర ఉంది. 1789లో అప్పటి పాలకులు మొదటిసారిగా ‘యుద్ధ విభాగం’ (War Department) ఏర్పాటైంది. చేశారు. ఆ సమయంలో సైన్యం, నావికాదళాన్ని పర్యవేక్షించే ‘యుద్ధ కార్యదర్శి’ అనే పదవి ఉండేది. అయితే కాలక్రమంలో భద్రతా అవసరాలు మారాయి. 1798లో ప్రత్యేక నేవీ విభాగం ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, 1947లో అమలులోకి వచ్చిన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా అమెరికా సైన్యాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. నాటి ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ సైన్యం, వైమానిక దళాన్ని సరి కొత్త రూపంలో ఏర్పాటు చేశారు. చివరికి 1949లో మూడు విభాగాలను కలిపి “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్” అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి రక్షణ శాఖ పేరుతోనే అమెరికా సైనిక శక్తి కొనసాగుతోంది.
ట్రంప్ ఆలోచన వెనుక కారణం
ట్రంప్ ప్రకారం, “డిఫెన్స్” అనే పదం రక్షణాత్మక భావనను ఇస్తుందని, కానీ అమెరికా చరిత్రలో ఆగ్రెసివ్ వైఖరితోనే విజయాలు సాధించిందని అంటున్నారు. ఆయన దృష్టిలో “వార్” అనే పదం శక్తి, ఆధిపత్యం, గెలుపును సూచిస్తుంది. అదే కారణంగా పాత పేరును తిరిగి ఉపయోగించాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం, ప్రపంచ యుద్ధాల్లో అమెరికా సాధించిన విజయాలు “డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్” పేరుతోనే సాధించబడ్డాయని భావనను ఆయన బలపరుస్తున్నారు.
రాజకీయ, వ్యూహాత్మక ప్రభావాలు
ఈ పేరు మార్పు కేవలం ఒక నామమాత్రపు అంశం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఇది అమెరికా వైఖరిని మరోసారి మిలిటరైజేషన్ దిశగా నడిపించే సంకేతంగా భావించబడుతోంది. “రక్షణ” అనే పదం కంటే “యుద్ధం” అనే పదం ఎక్కువ దూకుడు, శక్తివంతమైన మిలిటరీ ఇమేజ్‌ను ఇస్తుంది. ఫలితంగా మిత్రదేశాలకే కాకుండా, ప్రత్యర్థి దేశాలపై కూడా ఇది మానసిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. మరోవైపు, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయం అమెరికా శాంతి, భద్రతకు అనుకూలంగా ఉండదని, కేవలం రాజకీయ ప్రదర్శన కోసం తీసుకున్న అడుగని భావిస్తున్నారు.
అమలులోకి వచ్చేనా?
అయితే డొనాల్డ్ ట్రంప్ తెర మీదకు తెచ్చిన ఈ ప్రతిపాదన నిజంగా అమలులోకి వస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ ఆలోచన ఇప్పటికే రాజకీయ చర్చలకు దారితీస్తూ, అమెరికా భవిష్యత్ సైనిక దిశ ఏవైపు కదులుతుందన్న ప్రశ్నను మళ్లీ లేవనెత్తింది.