సీజ్ ఫైర్ కాదు... ఇరాన్ నుంచి ట్రంప్ కు కావాల్సింది ఇదేనంట!

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ఆగినట్లు అని నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు.;

Update: 2025-06-19 04:51 GMT

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌ పై దాడికి అమెరికా కూడా సిద్ధమైనట్లు గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు మరింతగా ఉద్రిక్తతలను పెంచేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీ7 సదస్సు నుంచి మధ్యలోనే వచ్చేసినప్పటి నుంచి ట్రంప్ చేస్తోన్న వ్యాఖ్యల్లో.. తాజా స్టేట్ మెంట్ పై చర్చ మొదలైంది.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ఖమేనీని అంతమొందిస్తేనే యుద్ధం ఆగినట్లు అని నెతన్యాహు క్లారిటీ ఇచ్చారు. ఖమేనీ ఎక్కడున్నారో తమకు తెలుసని, అయినప్పటికీ ఇప్పుడు చంపాలనుకోవడం లేదని ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సమయంలో.. సీజ్ ఫైర్ కూడా వద్దని అన్నారు.

అటు ప్రత్యర్థి నాయకుడు ఎక్కడున్నారో తెలుసు, అతనిని మట్టుబెట్టడం పెద్ద విషయం కాదు, అయినప్పటికీ అతడిని ఇప్పుడు చంపము అని చెబుతున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. తనకు కాల్పుల విరమణ కూడా వద్దని చెప్పడం గమనార్హం. ఇలా ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో తనకు సీజ్ ఫైర్ వద్దని.. తాను పూర్తి విజయం కోసమే చూస్తున్నానని ట్రంప్ తెలిపారు.

ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండటం ఏమిటి.. ట్రంప్ పూర్తి విజయం కోరుకోవడం ఏమిటి? అధికారికంగా ఇది అర్ధం లేని విషయమే! కానీ.. అనధికారికంగా.. ఇజ్రాయెల్ యుద్ధంలో సగం పాత్ర అమెరికాదే! దీంతో... ఫైనల్ వెర్షన్ వినిపించిన ట్రంప్... ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తన సంపూర్ణ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... ఇజ్రాయెల్‌ తో కొనసాగుతున్న ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ హెచ్చరించిన నేపథ్యంలో.. తాజా పరిణామాలపై స్పందించారు ట్రంప్. ఇందులో భాగంగా... టెహ్రాన్‌ హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు.

అకక్డితో ఆగని ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వచ్చేవారం చాలా కీలక పరిణామం చోటుచేసుకోవచ్చని, అంతలోపే జరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News