పండగ పూట రైలు ప్రయాణం.. రేప్‌లు-అగ్ని ప్రమాదాలు!
కీలకమైన దీపావళి పండగ ముందు.. రైలు ప్రయాణాలు చేయడం సహజం. దేశవ్యాప్తంగా దివ్వెల పండుగ దీపావళిని అందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు.;
కీలకమైన దీపావళి పండగ ముందు.. రైలు ప్రయాణాలు చేయడం సహజం. దేశవ్యాప్తంగా దివ్వెల పండుగ దీపావళిని అందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో సుదూర ప్రాంతాల వారు తమ తమ సొంత ప్రాంతాలకు వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే రైలు ప్రయాణాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. ఇప్పుడు రైలు ప్రయాణం అంటే.. ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా రిజర్వేషన్ చేయించుకున్నవారు.. 20 శాతం మంది రద్దు చేసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.
దీనికి ప్రధాన కారణం.. ఇటీవల వెలుగు చూసిన రెండు రేప్‌లు. తాజాగా జరిగిన రెండు అగ్ని ప్రమాదాలు. గుంటూరు పరిధిలో రెండు రోజుల కిందట సత్రగచ్చి-చర్లపల్లి రైలులో ఓ మహిళపై దుండగుడు అత్యాచా రానికి ఒడిగట్టాడు. అంతేకాదు.. ఆమె బ్యాగును, సెల్ ఫోన్‌ను కూడా అపహరించాడు. ఈ ఘటన దేశవ్యా ప్తంగా సంచలనం రేపింది. సదరు నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. మహిళా ప్రయాణిలు మాత్రం ఈ ఘటన విషయంలో రాజీ పడలేక పోతున్నారని తెలుస్తోంది.
అంతేకాదు.. ఇలా.. ఇప్పటికి గుంటూరు డివిజన్ పరిధిలో మరోముగ్గురు మహిళలపై కదులుతున్న రైల్లో అత్యాచారాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇక, తాజాగా రెండు రైళ్లకు అగ్ని ప్రమాదం జరిగింది. ఎక్కువ మంది ప్రయాణికులు ఆశ్రయించే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ రైలు పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి సహర్సా వెళ్తుండగా సిర్‌హిండ్ జంక్షన్ సమీపంలో భారీగా ఎగసిపడ్డ మంటలతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కరికి గురయ్యారు. ఈ ఘటనలో 3 కోచ్‌లు దగ్ధం అయ్యాయి.
ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు లుథియానా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని అధికారులు తెలిపారు. బోగీల నుంచి పొగ, మంటలు రావడంతో భయాందో ళనలకు గురైన ప్రయాణికులు.. కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నం చేసి గాయపడ్డారు. మరోవైపు.. తమిళనాడు వెళ్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్‌లోనూ.. రెండు రోజుల కింద మంటలు వచ్చాయి. దీంతో రైలును సడెన్‌గా నిలుపుదల చేశారు. ఈ పరిణామాలు పండుగల వేళ రైలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఆల్ ఆఫ్ ది సడెన్‌గా 20 శాతం మంది ప్రయాణికులు తమ రిజర్వేషన్‌ను రద్దు చేసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అయితే.. ఈ ప్రమాదాలే కారణమా? కాదా? అనేది తేలాల్సి ఉంది.