ఈ ఊళ్లో కోడికూత నిషేధం.. కారణం తెలిస్తే అవాక్కే

కారణం.. ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయంగా చెబుతారు. తమ పూర్వీకులు పాటించిన ఆచారాన్ని తాము కంటిన్యూ చేస్తున్నట్లుగా చెబుతారు.;

Update: 2025-05-25 08:30 GMT

కొన్ని గ్రామాల్లో ఆచారాలు.. ప్రజల జీవన విధానం ఆలోచనకు సైతం అందని రీతిలో ఉంటుంది. అలాంటి ఊరి కథగా దీన్ని చెప్పాలి. దశాబ్దాల తరబడి ఆ చిన్ని గ్రామంలో కోడి అన్నదే కనిపించదు. తెల్లవారుజామునే కొక్కరకో అనే కూతే ఆ ఊళ్లో వినిపించని పరిస్థితి. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈ డిజిటల్ యుగంలోనూ ఫాలో కావటం రోటీన్ కు భిన్నమని మాత్రం చెప్పకతప్పదు.

ఇంతకూ కోడి అన్నదే కనిపించని ఊరు ఏది? అదెక్కడ ఉంది? అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇప్పటికి ఆ ఆచారాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? దాని వెనకున్న అసలు కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. నమ్మలేని నిజాలు వెలుగు చూస్తాయి. కోడి అన్నదే కనిపించని ఆ ఊరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. శాంతిపురం మండలం కడపల్లె పంచాయితీ పరిధిలోని తిమ్మరాజుపల్లెలో కోడి కూత వినిపించదంతే.

కారణం.. ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయంగా చెబుతారు. తమ పూర్వీకులు పాటించిన ఆచారాన్ని తాము కంటిన్యూ చేస్తున్నట్లుగా చెబుతారు. ఇంతకూ ఆ నిబంధనను ఎందుకు తీసుకొచ్చారు? అని ప్రశ్నిస్తే వారో ఆసక్తికర సమాచారాన్ని చెబుతారు. వందేళ్ల క్రితం పెద్దబ్బ అనే పెద్దాయన కలలో తమ్మరాయస్వామి (ఆ ఊళ్లో ఉంటుంది) ప్రత్యక్షమై.. గ్రామంలో కోడి కూత వినబడితే గ్రామానికి మంచిది కాదని చెప్పారట.

ఆ విషయాన్ని పెద్దబ్బ ఊరి పెద్దలకు చెప్పటం.. వారు ఆ రోజు నుంచి ఊళ్లో కోడి కూత అన్నది లేకుండా చేయాలన్న కంకణం కట్టుకున్నారు. అనుకున్నట్లే ఊళ్లో కోడికూత వినిపించకుండా చేశారు. ఈ నమ్మకాన్ని నేటికి కంటిన్యూ చేయటం ఈ ఊరి విశేషం. ఈ సందర్భంగా ఈ ఊరు.. అక్కడి ప్రజలకు సంబంధించిన మరో ఆసక్తకర అంశాన్ని చెప్పాలి. తిమ్మరాజుపల్లెలో మొత్తం 120 కుటుంబాలుఉన్నాయి. ఊరంతా ఒకేబంధు వర్గానికి చెందిన వారే. గ్రామానికి దగ్గర్లోని తూర్పువైపు తిమ్మరాయస్వామి ఆలయాన్ని కట్టుకున్నారు. ఈ ఊళ్లోని ప్రజలకు దైవభక్తి మాత్రమేకాదు పెద్దల మాటకు విపరీతమైన విలువను ఇవ్వటం కనిపిస్తుంది.

Tags:    

Similar News