అక్కడ మెజారిటీ కొడితే కూటమిదే అధికారం !

ఈసారి కూడా కనీసంగా ఎంత తగ్గినా 35 నుంచి నలభై వస్తాయని ధీమాగా ఉంది.

Update: 2024-05-23 15:21 GMT

ఏపీలో మూడు రీజియన్లు ఉన్నాయి. ఈ మూడింటిలో రాజకీయ బలాబలాలు తలో రకంగా ఉన్నాయి. రాయలసీమ రీజియన్ లో వైసీపీ బలంగా ఉంది అన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే 2014, 2019ల్లో అక్కడే వైసీపీ తన బలాన్ని గట్టిగా చాటుకుంది. ఈసారి కూడా కనీసంగా ఎంత తగ్గినా 35 నుంచి నలభై వస్తాయని ధీమాగా ఉంది.

అదే జరిగితే అధికారం తమదే అని వైసీపీ చెబుతోంది. ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలలో ఉన్న 22 సీట్లలో పది దక్కుతాయని, అలాగే గుంటూరు క్రిష్ణాలలో ఉన్న 33 సీట్లలో పదిహేను దాకా వస్తాయి. ఇక గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్రా కలుపుకుని ఉన్న 68 సీట్లలో కనీసంగా ముప్పయి వచ్చినా బొటా బొటీ మెజారిటీతో బయట పడిపోతామని లెక్కలు వేస్తుంటున్నారు.

ఇక టీడీపీ కూటమి లెక్కలు కూడా చాలానే ఉన్నాయి. జనసేన టీడీపీ పొత్తు వల్ల ఉభయ గోదావరి కృష్ణ గుంటూరులలో ఉన్న 67 సీట్లలో దాదాపుగా యాభైకి తక్కువ కాకుండా వస్తాయని లెక్క వేసుకుంటోంది. అలాగే ఉత్తరాంధ్రాలో మెజారిటీ సీట్లు అంటే ఇరవైకి పై దాటి వస్తాయని భావిస్తోంది. ఇక నెల్లూరు ప్రకాశంలో మారిన రాజకీయ నేపధ్యంలో తమకు కనీసం సగం సీట్లు పై దాటి వస్తాయని కూడా అంచనా కడుతోంది.

రాయలసీమలో అయితే టీడీపీ కూటమి ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ 20 పైగా సీట్లు ఈసారి దక్కడం ఖాయమని భావిస్తోంది. ఇవన్నీ చూసినపుడు టీడీపీ కూటమికి తక్కువలో తక్కువ అంటే సెంచరీ పై దాటి వస్తాయని అంటున్నారు. అయితే కూటమికి సైలెంట్ వేవ్ ఉందని అంటున్నారు. అదే కనుక జరిగితే కోస్తా జిల్లాలలోనే అంటే క్రిష్ణా గుంటూరు నుంచి ఉత్తరాంధ్రా దాకా ఒక బలమైన ప్రభంజనం వీస్తుందని అలా 101 సీట్లలో ఏకంగా 88 సీట్లు ఇక్కడే తాము రాబడతామని అపుడు గ్రేటర్ రాయలసీమ ఆరు జిల్లాలలో ఉన్న 74 సీట్లలో కనీసంగా మరో నలభై సీట్లు ఈజీగా వస్తాయని అలా 130 పైగా సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని కూటమి లెక్క ఉంది.

Read more!

మొత్తం మీద చూస్తే ఎవరి ధీమా వారిది గా ఉంది. అయితే కూటమికి 2014లో చూస్తే కోస్తా జిల్లాలలోనే భారీగా సీట్లు దక్కాయి. ఈసారి కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని అందువల్ల తమకు మ్యాజిక్ ఫిగర్ 88 కోసం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని అంటున్నారు. అంటే టీడీపీ కూటమికి ఎటు నుంచి ఎలా చూసుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నారు. మరి జూన్ 4న ఫలితాలు ఎలా వస్తాయో కానీ రెండు పార్టీల శిబిరాలలో వేవ్ ఉంటే ఒక నంబర్ లేకపోతే మరో లెక్క అని విశ్లేషించుకుంటున్నాయి. ఎలాగైనా కూడా అధికారం తమదే అన్నది రెండు శిబిరాలలో ఈ రోజుకు ఉన్న ధీమాగా చెబుతున్నారు.

Tags:    

Similar News