76 లక్షల మంది సభ్యులు... లోక్ సభ ఎన్నికల్లో దళపతి వర్గం ఎటువైపు?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలూ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-14 23:30 GMT

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలూ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి అటు ఎన్డీయేకు, ఇటు ఇండియా కూటమికీ దక్షిణాది ఫలితాలు అత్యంత కీలక కాబోతున్నాయని అంటున్న నేపథ్యంలో... తమిళనాట ఫలితాలపైనా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో... తాజాగా తమిళనాట పార్టీని స్థాపించిన స్టార్ హీరో, దళపతి వర్గం రానున్న ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోందనేది ఆసక్తిగా మారింది.

అవును... ఇటీవలే "తమిళగ వెట్రి క్కళగం" పార్టీని స్థాపించారు హీరో విజయ్. ఈ క్రమంలో పార్టీని స్థాపించిన కొద్దినాళ్లకే 76 లక్షల మంది ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు! రాష్ట్ర వ్యాప్తంగా యువతలో విజయ్ సరికొత్త ఆశలు రేపడమే ఇందుకు బలమైన కారణం అని అంటున్నారు. అయితే ఈ లోక్ సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగడం లేదు. తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు!

దీంతో.. పార్టీ స్థాపన నుంచి విజయ్ కేవలం ప్రకటనల ద్వారా మాత్రమే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర పార్టీలపై విమర్శల ప్రయత్నాలు ఇంకా స్టార్ట్ చేయలేదని తెలుస్తుంది! ఇదే సమయంలో... పార్టీ సిద్ధాంతాలు, జెండా, అజెండా తదితరాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. అందుకు ఏం చేయాలన్నది నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని అంటున్నారు!

ఈ క్రమంలో... 2026న జరిగే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే క్రమంలో... ఈ లోక్‌ సభ ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని కూడా విజయ్‌ ప్రకటించారు. ఇలా ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనందున.. ఆయన అభిమానులు, కార్యకర్తలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఇందులో భాగంగా... గతంలో విజయ్ తో తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను విస్తృతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... విజయ్ వీరాభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... విజయ్ వర్గం ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలబడారనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News