విదేశీ టూరిస్ట్ లకు థాయిలాండ్ బంపర్ ఆఫర్.. ఫ్రీ.. ఫ్రీ..
ఈమధ్య టూరిస్ట్ లను ఆకర్షించడానికి టూరిస్ట్ యంత్రాంగం ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తున్నారు.;
ఈమధ్య టూరిస్ట్ లను ఆకర్షించడానికి టూరిస్ట్ యంత్రాంగం ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్ లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా దేశ విదేశీయుల నుండి టూరిస్టులు ఆ ప్రాంతాలకు రప్పించడానికి బంపర్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయులతో సహా విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి థాయిలాండ్ కనీవిని ఎరుగని రీతిలో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంతేకాదు ఆదాయాన్ని పెంచుకోవడానికి.. పర్యాటక ప్రదేశాలు ఆదరణ పొందడానికి సరికొత్త ట్రావెల్ స్కీములు ప్రవేశ పెడుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఇంతకీ థాయిలాండ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించడానికి ఎలాంటి స్కీం ప్రకటించింది.? ఈ స్కీం వల్ల పర్యాటకులకు కలిగే లాభం ఏమిటి..? థాయిలాండ్ లోని ఏ ఏ ప్రాంతాలకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. థాయిలాండ్ ప్రభుత్వం.. తమ దేశంలోని పర్యాటక ప్రదేశాలు, ప్రజల ఆదరణ పొందడానికి కొత్త ట్రావెల్ స్కీమ్ తో మనం ముందుకు వచ్చారు. దీని కింద దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించడం గమనార్హం. థాయిలాండ్ లోని ఫుకెట్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలకు మాత్రమే విదేశీ పర్యటకులు ఎక్కువగా వెళ్తున్నారని ఆ ప్రభుత్వం గ్రహించింది. ఇక మిగిలిన ప్రదేశాలు కూడా చూసేలా తమ దేశంలో విమాన ప్రయాణం ఉచితం చేయాలని చూస్తూ "బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయిలాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్" పేరిట ఒక సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ముఖ్యంగా ఈ ఆఫర్ కింద దేశ విమానాలలో ప్రయాణించే వారికి టికెట్ ధర 1750 బాత్, రౌండ్ ట్రిప్స్ అయితే 3,500 బాత్ ను ప్రభుత్వమే ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రమే ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు స్థానిక మీడియాలు కూడా కథనాలు వెల్లడించాయి. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది టూరిస్ట్ లకు మంచి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇకపోతే థాయిలాండ్ కి స్టాండర్డ్ ఇంటర్నేషనల్ టికెట్స్ తీసుకున్న ప్రయాణికులు... మల్టీసిటీ ఆప్షన్స్, ఎయిర్ లైన్ వెబ్ సైట్స్, ఫ్లై త్రూ సర్వీసెస్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ వద్ద ఈ ఆఫర్ ను పొందవచ్చు.
ముఖ్యంగా ప్రతి ప్రయాణికుడు రెండు దేశీయ విమాన టికెట్లు పొందడానికి వీలు ఉంటుంది.. ఈ ప్రాజెక్టు కింద రెండు లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను రప్పించాలనే లక్ష్యంతోనే థాయిలాండ్ ప్రభుత్వం ఈ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. అంతేకాదు ఈ ఆఫర్ వర్క్ అవుట్ అయితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారుగా 21.80 బిలియన్ బాత్ మేర ప్రయోజనం కలుగుతుందని తెలుస్తోంది. పైగా ఈ ప్రయాణంలో ఒక్కొక్క ప్రయాణికుడు 20 కేజీల బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా థాయిలాండ్ దేశ టూరిజం అథారిటీ.. ఆరు దేశీయ విమానయాన సంస్థలతో కలిసి పనిచేయనుంది అని సమాచారం. ఏది ఏమైనా టూరిస్ట్లను ఆకర్షించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి టూరిస్ట్ యంత్రాంగం ఏమేం చేయాలో అన్నీ చేసేస్తున్నారు. మరి ఈసారైనా ఈ సరికొత్త స్కీమ్ తో థాయిలాండ్ ఆదాయం మరింత పెరుగుతుందని ఆశిస్తున్న ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో చూడాలి.