శ్రీనగర్ లో 80 మంది తెలంగాణ టూరిస్టులు.. తాజా అప్ డేట్ ఇదే!

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న తీవ్రమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర షాకింగ్ ఘటనగా మారిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-23 09:30 GMT

జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న తీవ్రమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర షాకింగ్ ఘటనగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో కశ్మీర్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ పర్యాటకులకు సంబంధించిన కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

అవును... తాజాగా పహల్గాం ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో తెలంగాణ జిల్లాల నుంచి పలువురు పర్యాటకులు శ్రీనగర్ కు వెళ్లారు. అయితే తాజా ఉగ్రదాడి నేపథ్యంలో వీరు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో సుమారు 80 మంది తెలంగాణ పర్యాటకులు శ్రీనగర్ లోని ఓ హోటల్ లో చిక్కుకుపోయారు. దీనిపై వారు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. తామంతా శ్రీనగర్ లోని హోటల్ లో చిక్కుకుపోయామని.. తమను హైదరాబాద్ కు సురక్షితంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సమయంలో హోటల్ లో చిక్కుకున్నవారిలో హైదరాబాద్ నుంచి 20 మంది, మహబూబ్ నగర్ నుంచి 15, వరంగల్, సంగారెడ్డిల నుంచి తలో 10 మంది.. మెదక్ కు చెందిన రెండు కుటుంబాలు ఉన్నాయి. వీరంతా మంగళవారం జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లి.. శ్రీనగర్ హోటల్ లో చిక్కుకుపోయారు.

మరోపక్క.. శ్రీనగర్ లోని ఓ హోటల్ యాజమాన్యం.. ఆందోళనలో ఉన్న పర్యాటకులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా... జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న హోటల్ "ది కైసార్" యజమాని షేక్ కైసర్ స్పందిస్తూ... ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న పర్యాటకులకు ఉచితంగా ఆహారం, నివాసం అందించాలనుకున్నట్లు తెలిపారు. ఈ చర్య పర్యాటకుల హృదయాలను గెలుచుకుంది.

Full View
Tags:    

Similar News