‘నన్ను ఓడించారు.. నా భార్యనైనా గెలిపించండి’ టచ్ చేసే ప్రచారం!
తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో సిత్రాలకు కొదవు ఉండటం లేదు.;
తెలంగాణలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో సిత్రాలకు కొదవు ఉండటం లేదు. తాజాగా ఒక అభ్యర్థి తరఫున ఆమె భర్త చేసిన ప్రచారం అందరిని ఆకట్టుకోవటమే కాదు.. మనసును టచ్ చేసేలా ఉండటం గమనార్హం. ఎన్నికల్లో తనను ఓడించారని.. తాజాగా జరగుతున్న ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుందని.. కనీసం తన భార్యనైనా గెలిపించాలని కన్నీళ్లతో గ్రామస్తుల్నిఅభ్యర్థిస్తున్న సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త అడుగుతున్న తీరు టచ్ చేసేలా ఉందని చెబుతున్నారు. ఇతగాడి ప్రచారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఇదంతా ఎక్కడంటే..
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన బలగంతో నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఆమె భర్త.. నామినేషన్ అనంతరం మాట్లాడిన మాటలు అక్కడి వారిని టచ్ చేసేలా మారాయి. నామినేషన్ కోసం తన వెంట వచ్చిన గ్రామస్తులను ఉద్దేశించి సర్పంచ్ అభ్యర్థి భర్త ప్రశాంత్ మాట్లాడారు.
గతంలో తాను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని.. ఈసారి ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుందని.. కనీసం ఆమెనైనా గెలిపించాని కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అభ్యర్థించాడు. భర్త భావోద్వేగాన్ని చూసిన భార్య స్రవంతి కూడా కంటతడి పెట్టారు. నామినేషన్ వేళ.. తమను వేడుకున్న ప్రశాంత తీరుతో వారి అనుచరులు సైతం భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. మరి.. ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.