టీడీపీ రెండో జాబితా... తూగోలో తాజా పరిస్థితి ఇదే!

అవును... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోనూ కూటమికి చెందిన అభ్యర్థులు 15మంది ఇప్పటికే ఫిక్సయిన పరిస్థితి.

Update: 2024-03-14 09:31 GMT

అభ్యర్థుల తొలి విడత జాబితాలో భాగంగా 94 అసెంబ్లీ నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ... తాజాగా రెండో విడతలో భాగంగా మరొ 34 నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించింది. దీంతో... ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోనూ 15 నియోజకవర్గాలకు కూటమి అభ్యర్థులు కన్ ఫాం అయ్యారు. దీంతో మిగిలిన నాలుగు స్థానాల్లోనూ ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది.. అందులో పవన్ స్థానం ఎక్కడ అనేది మరింత ఆసక్తిగా మారింది.

అవును... ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లోనూ కూటమికి చెందిన అభ్యర్థులు 15మంది ఇప్పటికే ఫిక్సయిన పరిస్థితి. దీంతో... ఇక మిగిలిన నాలుగు స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఎవరు, బీజేపీ నేతలు ఎవరు, టీడీపీకి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తొలి విడత జాబితాలో భాగంగా చంద్రబాబు 9మంది అభ్యర్థులను ప్రకటించారు.

ఇందులో భాగంగా... తుని - యనమల దివ్య, పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం - సుబ్బరాజు, గన్నవరం – రాజేష్ కుమార్, కొత్తపేట - బండారు సత్యానంద రావు, మండపేట - జోగేశ్వర రావు, రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు లకు టిక్కెట్లు కేటాయించారు చంద్రబాబు.

Read more!

అయితే... ఇక్కడ గన్నవరం విషయంలో సమస్య రావడంతో... అక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి అయ్యాజీ వేమ పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ప్రకటించిన రెండో జాబితాలోనూ ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు బాబు. ఇందులో భాగంగా... రాజమండ్రి రూరల్ - బుచ్చయ్య చౌదరి, ప్రత్తిపాడు - సత్య ప్రభ, రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్ ల పేర్లు వెల్లడించారు.

ఇక మిగిలిన నియోజకవర్గాలైన రాజోలు, రాజానగరం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, అమలాపురం, రంపచోడవరం లలో... రాజోలు - దేవ వరప్రసాద్, రాజానగరం - బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ - పంతం నానాజీ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు! ఈ నేపథ్యంలో ఇక మిగిలినవాటిలో కాకినాడ సిటీ, అమలాపురం, పిఠాపురం, రంపచోడవరం నియోజకవర్గాలు మాత్రమే ఉమ్మడి తూరుపుగోదావరిలో మిగిలి ఉన్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే భీమవరం, గాజువాకలతో పాటు తిరుపతికి అభ్యర్థులు కన్ ఫాం అయిపోయిన నేపథ్యంలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయడానికి ఇక కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు లెక్క. మిగిలిన వాటిలో అమలాపురం నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాగా.. రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. దీంతో... పవన్ పోటీ ఎక్కడ నుంచి అనేది కూడా ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News