టీడీపీ ఫైనల్ లిస్ట్ విడుదల... సర్ ప్రైజ్ లు ఇవే!

దీంతో ఇక టీడీపీ అభ్యర్థులు 144 స్థానాల్లోనూ ప్రచారలకు బయలుదేరడమే మిగిలిందని అంటున్నారు!

Update: 2024-03-29 10:12 GMT

తమ అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న 9 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలీ స్థానాలతో సహా.. పొత్తులో భాగంగా తమకు మిగిలిన అన్ని స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసేసింది. దీంతో ఇక టీడీపీ అభ్యర్థులు 144 స్థానాల్లోనూ ప్రచారలకు బయలుదేరడమే మిగిలిందని అంటున్నారు!

అవును... టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 4 ఎంపీ అభ్యర్థులనూ ప్రకటించారు. కాగా... పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలను కేటాయించుకున్న సంగతి తెలిసిందే! ఈ మేరకు ఇప్పటికే రెండు విడతల్లో 135 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బాబు... తాజాగా మిగిలిన వాటినీ కన్ ఫాం చేసేశారు!

ఇందులో ఎంపీ అభ్యర్థుల విషయానికొస్తే... విజయనగరం నుంచి కలిశెట్టి అప్పలనాయుడి పేరు కన్ ఫాం చేశారు చంద్రబాబు. ఇదే సమయంలో... ఒంగోలు స్థానంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరునే ప్రకటించారు. వాస్తవానికి ఈసారి మాగుంట తనయుడు రాఘవరెడ్డి పేరు ఖరారు చేస్తారని కథనాలొచ్చినా... ఢిల్లీ లిక్కర్ స్కాం కారణంగా పునరాలోచన చేశారని తెలుస్తుంది! 2019 ఎన్నికల్లో మాగుంట వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక రాయలసీమలోని మిగిలిన రెండు లోక్ సభ స్థానాల్లో అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ పేరును ఖరారు చేసిన చంద్రబాబు... కడపకు జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న భూపేష్ రెడ్డిని ప్రకటించారు. జమ్మలమడుగు నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి వెల్లడంతో అక్కడ నుంచి ఆదినారాయణరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూపేష్ రెడ్డిని కడపకు పంపారు!

Read more!

ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికొస్తే... ప్రధానంగా చీపురుపల్లి, భీమిలి విషయాలపై క్లారిటీ వచ్చింది. ఈ విషయంలో గంటా శ్రీనివాస్ పంతమే నెగ్గిందని అంటున్నారు! ఇందులో భాగంగా... తాను కోరుకున్నట్లుగా గంటాకు భీమిలి స్థానాన్ని కేటాయించిన బాబు, చీపురుపల్లిని కిమిడి కళావెంకట్రావుకు కేటాయించారు. దీంతో... 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తయినట్లయ్యింది!

అసెంబ్లీ నియోజకవర్గాలు - అభ్యర్థులు:

చీపురుపల్లి - కళా వెంకట్రావు

భీమిలి - గంటా శ్రీనివాస రావు

పాడేరు - వెంకట రమేష్ నాయుడు

దర్శి - గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు - వీరభద్ర గౌడ్

గుంతకల్లు - గుమ్మనూరు జయరాం

అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్

కదిరి - కందికుంట వెంకట ప్రసాద్

పార్లమెంట్ నియోజకవర్గాలు - అభ్యర్థులు:

విజయనగరం - కలిశేట్టి అప్పలనాయుడు

ఒంగోలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి

అనంతపురం - అంబికా లక్ష్మీనారాయణ

కడప – భూపేష్ రెడ్డి

Tags:    

Similar News