'కొండపల్లి'పై టీడీపీ జెండా.. ఏం జరిగింది?
కొన్నాళ్ల కిందట తీవ్ర వివాదంగా మారిన ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మునిసిపాలిటీ.. వ్యవహారం ఎట్టకే లకు కొలిక్కి వచ్చింది.;
కొన్నాళ్ల కిందట తీవ్ర వివాదంగా మారిన ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మునిసిపాలిటీ.. వ్యవహారం ఎట్టకే లకు కొలిక్కి వచ్చింది. దీనిపై హైకోర్టు కూడా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో 2021-22 మధ్య ఈ మునిసిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చాక.. ఇక్కడ వైసీపీపై కొందరు నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ క్రమంలో పెద్ద వివాదమే చోటు చేసుకుం ది. ముఖ్యంగామునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌పదవులు హాట్ హాట్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో మూడు మాసాల కిందట ఇక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఇది రాజకీయ రణ రంగాన్ని తలపించింది. వైసీపీ కౌన్సిలర్లను నిర్బంధించారని.. పోలీసులు చోద్యం చూశారని అప్పట్లో పెను వివాదం తెరమీదికి వచ్చింది. దీనిపై హైకోర్టు విచారణ జరిగింది. పోలీసులకు తాఖీదులు ఇచ్చింది. అదే సమయంలో దీనిపై హైకోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా దీని ప్రకారం.. కొండపల్లి మునిసిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది.
చైర్మన్‌గా టీడీపీకి చెందిన చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాస్ ఎన్నికయ్యా రు. అలాగే వైస్ చైర్‌పర్సన్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సీల్డ్ కవర్లోతీసుకువచ్చిన అధికారులు కౌన్సిల్‌లోనే తెరిచి తీర్పును వివరించారు. దీనిప్రకారం.. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కొండపల్లి ఖిల్లాపై టీడీపీ జెండా ఎగిరినట్టయింది.
అయితే.. వచ్చే ఏడాది చివరిలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఐదేళ్ల గడువు పూర్తి కానుంది. దీంతో ఇప్పుడు టీడీపీ దీనిని దక్కించుకున్నా.. కేవలం ఏడాది పాటు మాత్రమే పాలనకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత.. ఎన్నికలు జరుగుతాయా? లేక ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తుందా? అనేది చూడాలి. ఈ పరిణామంతో వైసీపీ నాయకులు ఖిన్నులయ్యారు.