ఈ సారి మ‌హానాడును ఎవ్వ‌రూ త‌ప్పించుకోలేరా...?

తెలుగు దేశం పార్టీ ఏటా నిర్వ‌హించుకునే ప‌సుపు పండుగ‌.. మ‌హానాడును ఈ సారి పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

Update: 2026-05-25 00:30 GMT

తెలుగు దేశం పార్టీ ఏటా నిర్వ‌హించుకునే ప‌సుపు పండుగ‌.. మ‌హానాడును ఈ సారి పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. మూడు రోజుల పాటునిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న ఈ మ‌హానాడును 27, 28 తేదీలు రెండు రోజుల‌కే ప‌రిమితం చేశారు. అయితే.. రెండు రోజుల్లోనూ.. పూర్తిస్థాయిలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాలనినిర్ణ‌యించారు. పేరుకే ఆన్‌లైన్ అయిన‌ప్ప టికీ.. కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి లోటు పాట్లు రాకుండా చూడాల‌ని నిర్దేశించారు.

అయితే.. సాధార‌ణంగా ఎలాంటి కార్య‌క్ర‌మంలో అయినా.. కొన్ని కొన్ని సార్లు లోటు పాట్లు జ‌రుగుతుంటా యి. ప్ర‌ధానంగా ఏ కార్య‌క్ర‌మం అయినా.. ప్ర‌త్య‌క్షంగా జ‌రిగితే ఉండే ఇంపాక్ట్ (ప్ర‌భావం) వేరేగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో జ‌రిగితే వేరేగా ఉంటుంది. ఈ వ్య‌వ‌హార‌మే ఇప్పుడు మ‌హానాడుపైనా ప్ర‌భావం చూపించే అవ కాశం ఉంటుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ వ్య‌వ‌హారంపై మంత్రి, పార్టీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు లోకేష్ దృష్టి పెట్టారు.

ఏం జ‌రుగుతుంద‌ని..

ప్ర‌త్య‌క్ష మ‌హానాడు అయితే.. నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌లకు ఉండే ఉత్సాహం వేరు. ఆ సంద‌డి వేరు. అయి తే.. ఆన్‌లైన్‌లో నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రు వ‌చ్చినా.. రాక‌పోయినా.. ఈ కార్య‌క్ర‌మంలో కీల‌క నాయకులు ఉంటారు కాబ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు మంద‌గించే అవ‌కాశం ఉంటుంది. వెళ్లొచ్చులే.. చూడొ చ్చులే.. అనే ధోర‌ణి పెరుగుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఇది స‌హ‌జం కూడా. కానీ.. ఇప్పుడు ఈ ఆలోచ‌న‌ల‌కు బ్రేక్ వేస్తూ.. పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మ‌హానాడును ఎవ‌రూ త‌ప్పించుకోలేరంటూ.. పార్టీనాయ‌కులు చెబుతున్నారు. మ‌హానాడునుఉద‌యం 8 గంట‌ల‌కే ప్రారంభించాల‌నినిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో మై-టీడీపీ యాప్ ద్వారా హాజ‌రును న‌మోదు చేయ‌నున్నారు. ఎంత మంది వ‌చ్చారు? అనే లెక్క‌తోపాటు.. వారు ఎన్నిగంట‌ల‌కు వ‌చ్చారు.. ఎన్ని గంట‌లు.. ఉన్నారు? అనే విష‌యాల‌ను కూడా న‌మోదు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఆన్‌లైన్‌లో నిర్వ‌హిం చిన‌ప్ప‌టికీ.. దీనిని దిగ్విజ‌యం చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో మ‌హానాడును త‌ప్పించుకోవ‌డం.. స‌మ‌యం పాటించ‌కుండా ఉండ‌డం వంటి సాధ్యంకాద‌ని అంటున్నారు.

Tags:    

Similar News