ఇంచార్జ్‌లే అసలు సమస్య.. తమ్ముళ్లలో అసంతృప్తి.. !
అధికార టీడీపీలో నాయకుల మధ్య అసంతృప్తి పెరుగుతోంది. ఎక్కడికక్కడ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికార టీడీపీలో నాయకుల మధ్య అసంతృప్తి పెరుగుతోంది. ఎక్కడికక్కడ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం.. ఆధిపత్య ధోరణి వరకు కూడా జరుగుతుండడం గమనార్హం. వాస్తవానికి.. నాయకుల మధ్య సఖ్యత వల్లే గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. అందరూ కలస కట్టుగా ముందుకు సాగి.. పార్టీని విజయ తీరం వైపు నడిపించారు. అయితే.. నాటి ఎన్నికల స్ఫూర్తి ఇప్పుడు కనిపించడం లేదన్నది వాస్తవం. నిజానికి రెండే ళ్ల కాలంలో ఈ స్ఫూర్తి మరింత పెరగాలి.
కానీ, పరిస్థితుల ప్రభావమో.. లేక స్థానికంగా జరుగుతున్న ఇతర కారణాలతో తెలియదు కానీ.. నాయకుల మధ్య సఖ్యత పెద్దగా కనిపించడం లేదన్నది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబుసైతం అంగీకరిస్తున్నారు. నాయకుల ను హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ మార్పు పెద్దగా కనిపించడం లేదు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి అనుకున్న విధంగా అయితే లేదనే చెప్పాలి. ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు స్థానిక ఎన్నికల సమరం కూడా రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలో అసలు సమస్యలు ఏంటి? అనేది ప్రశ్న. అంతేకాదు.. నాయకుల మధ్య ఎందుకు ఇంత యాగీ జరు గుతోంది? అనేది కీలక అంశం. ప్రస్తుతం ఉన్న ఇంచార్జ్‌లతో సీనియర్ నాయకులకు కలివిడి లేకపోవడంతోనే అంతర్గతంగా వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని అంటున్నారు. అంతేకాదు.. స్థానికంగా జరుగుతున్న కొన్ని కీలక అంశాలపై కూడా వివాదాలు ఉన్నాయి. దీంతో నాయకులకు-ఇంచార్జ్‌లకు మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇక, క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి.. ప్రాధాన్యం ఇవ్వడం కూడా సమస్యగా మారుతోంది.
ఈ పరిణామాలే క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. వీటిని సరిదిద్దే బాధ్యతను ఎమ్మెల్యేల కు, ఎంపీలకు అప్పగించామని పార్టీ నాయకత్వం చెబుతోంది. అయితే.. ఎవరూ ఎవరి స్థాయిలోనూ పెద్దగా ఈ వ్యవ హారాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో స్థానికంగా జరిగే ఎన్నికలపై ఈ ప్రభావం పడుతుందన్న వాదన ఉంది. నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం కోసం.. పార్టీ పైస్థాయిలో ప్రయత్నం చేస్తున్నా.. క్షేత్రస్థాయి లో మాత్రం ఆ దిశగా అడుగులు పడడం లేదన్నది వాస్తవం. దీనిని సరిచేయాల్సిన పరిస్థితి ఉంది.