త‌మ్ముడూ తెలుసుకో.. బాబుది మంచిత‌న‌మే.. !

పార్టీ ప‌రంగా తలెత్తుతున్న వివాదాలు.. విభేదాలు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి టీడీపీకి ఇబ్బందిగా మారాయన్న‌ది వాస్త‌వం.;

Update: 2025-11-11 09:52 GMT

పార్టీ ప‌రంగా తలెత్తుతున్న వివాదాలు.. విభేదాలు, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు వంటివి టీడీపీకి ఇబ్బందిగా మారాయన్న‌ది వాస్త‌వం. అనేక నియోజ‌క‌వర్గాల్లో ఎమ్మెల్యేల‌కు.. ద్వితీయ శ్రేణి నాయ‌కుల‌కు మ‌ధ్య పొస గ‌డం లేదు. అదేవిధంగా ఎమ్మెల్యేలు-ఎంపీల‌కు మ‌ధ్య వివాదాలు త‌ర‌చుగా నిప్పులు రాజేస్తున్నారు. తిరు వూరు, శ్రీశైలం, గుంటూరు నియోకవ‌ర్గాల ప‌రిధిలో ఈ వివాదాలు రోడ్డున కూడా ప‌డ్డాయి. ఇక‌, అంత‌ర్గ‌తం గా జ‌రుగుతున్న వివాదాలు కామ‌న్‌గా మారాయి.

అయితే.. ఈ విష‌యాల‌పై పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు.. దృష్టి పెట్టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని చెబుతు న్నారు. పార్టీలైన్‌ను ఎవ‌రు దాటినా.. ఊరుకునేది లేద‌ని కూడా చెబుతున్నారు. అదేస‌మ‌యంలో క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీని కూడా యాక్టివ్ చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. దీంతో వివాదాల‌కు దిగుతున్న నాయ‌కులు.. విభేదాల‌తో అంట‌కాగుతున్న నాయ‌కుల‌కు.. ఇది పెద్ద ప్ల‌స్ అయింద‌న్న టాక్ వినిపిస్తోంది.

ఏం చేసినా చంద్ర‌బాబుకేవ‌లం హెచ్చ‌రిక‌ల‌కే ప‌రిమితం అవుతార‌ని.. చ‌ర్య‌లు తీసుకోర‌ని వారు అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కూడా చంద్ర‌బాబుకు తాజాగా పార్టీ రాష్ట్ర చీఫ్ వెల్లడిం చిన‌ట్టు తెలిసింది. ఒక‌రిద్ద‌రు చేస్తున్న వ్యాఖ్య‌లు.. దుమారం కార‌ణంగా పార్టీకి ఇబ్బంది వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అయితే.. చంద్ర‌బాబు అన్నీ తాను ప‌రిశీలిస్తున్నాన‌ని.. స‌మ‌యం చూసుకుని చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు.

కానీ.. అస‌లు స‌ద‌రు వివాదాస్ప‌ద నాయ‌కులు భావిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు మెత‌క వైఖ‌రి అవ‌లంభిస్తున్నా రా? ఆయ‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాలంటే.. పెద్ద విష‌యమా? అంటే.. అదేం కాదు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఆది నుంచి కూడా నాయ‌కుల‌కే ఎక్కువ‌గా అవ‌కాశం ఇస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన వివాదాలు సృష్టించిన వారిపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం దీనికి ఉదాహ‌ర‌ణ‌.

గ‌తంలో స‌త్య‌వేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు న‌మోదైన‌ప్పుడు(త‌ర్వాత వెన‌క్కి తీసుకున్నారు) పార్టీ నుంచి స‌స్సెండ్ వేటు వేశారు. అదేవిధంగా న‌కిలీమ‌ద్యం కేసులో పేరు బ‌య‌ట‌కు రాగానే జ‌య చంద్రారెడ్డిని ప‌క్క‌న పెట్టారు. సో.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబుది మెత‌క ధోర‌ణి కాదు. `మారేందుకు ఒక ఛాన్స్‌` ఇస్తున్నార‌న్న విష‌యాన్ని త‌మ్ముళ్లు గ్ర‌హించాల‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతున్నారు.

Tags:    

Similar News