కొలికపూడి తగ్గేది లేదా....బాబు సీరియస్ గానే ?
తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నట్లుగా వివాదం రాజుకుంది.;
టీడీపీలో అధికారంలో ఉండగానే వర్గ పోరు పెచ్చరిల్లుతోంది. ఎవరికి ఎవరూ తక్కువ కానట్లుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఎంతో ఓపికగా నేతలకు బాబు చెబుతూ వస్తున్నారు. తమ్ముళ్లకు కూడా దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. కానేఎ ఏవీ ఎక్కడా ఆగడం లేదు,
కొలికపూడి వర్సెస్ చిన్ని :
తాజాగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నట్లుగా వివాదం రాజుకుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. దానికి ముందు కొలికపూడి సోషల్ మీడియా ద్వారా ఎంపీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. ఇలా పార్టీ విషయాలు వీధిన పడడంతో దుబాయ్ నుంచే బాబు నేరుగా ఫోన్ ద్వారా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుతో అన్నీ చర్చించారు. తాను వచ్చాక మొత్తం విషయాలు చూసుకుంటాను అని కూడా చెప్పినట్లుగా ప్రచారం సాగింది.
ఎమ్మెల్యే తగ్గేది లేదా :
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విషయం తీసుకుంటే ఆయన అమరావతి రాజధాని కోసం ఉద్యమించిన ఉద్యమ నాయకుడు. ఆయన టీడీపీ మెంబర్ అయితే కాదు, కానీ ఆ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చి టీడీపీతో కలసి పోరాటాలు చేసి ఆ పార్టీ ద్వారా 2024 ఎన్నికల్లో టికెట్ తీసుకుని తిరువూరు నుంచి పోటీ చేసి గెలిచారు. అలా ఆయన తొలిసారి ఎమ్మెల్యే కావడం పార్టీకి కూడా కొత్త కావడం దూకుడు స్వభావంతో వ్యవహరించడం వల్ల ఆది నుంచే వివాదాలు ఏర్పడ్డాయి. దాంతో గతంలో వివాదాలను పరిష్కరించే క్రమంలో అధినాయకత్వం తిరువూరు పార్టీ బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించింది. ఆయన తిరువూరులో అన్నీ చూసుకుంటున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి కూడా పార్టీ పరంగా వేరుగా కార్యక్రమాలు చేస్తున్నారు.
విభేదాలు అక్కడే :
ఇక చూస్తే తనను పక్కన పెట్టి ఎంపీకి పార్టీ బాధ్యతలు ఇవ్వడం అంతా ఆయనే అన్నట్లుగా చేయడంతోనే కొలికపూడి శ్రీనివాస్ సహించలేకపోతున్నారు. ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తాను కేవలం ఎమ్మెల్యే అన్నట్లుగా నామమాత్రం అయ్యాను అని ఆయన మధనపడుతున్నారు. ఇక ఎమ్మెల్యేగా కొలికపూడి ఉన్నా పార్టీ పదవులు అయినా నామినేటెడ్ పదవులు అయినా చిన్ని చెప్పిన వారికే ఇస్తున్నారు. అలా ఆయన ఎమ్మెల్యేగా మారిపోతే కొలికపూడి అలా ఉన్నారు అంతే అనిపించుకుంటున్నారు. దాంతోనే ఆయనలో ఆగ్రహం పెరిగిపోతోంది అని అంటున్నారు.
గతంలో కూడా :
ఇక కొలికపూడి శ్రీనివాస్ గతంలోనూ దూకుడుగా వ్యవహరించడంతో ఏకంగా సొంత పార్టీ నేతలే ఆయన మీద అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడం వారు పిలిచి మాట్లాడడం జరిగాయి. అయితే ఇపుడు ఏకంగా ఎంపీ మీదనే విమర్శలు చేశారు. ఏకంగా తాను అయిదు కోట్లు ఇచ్చాను అని టికెట్ కోసం చిన్ని అడిగారు అని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దాంతో ఇది హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.
బాబు సమక్షంలో :
ఇక చంద్రబాబు విదేశీ పర్యటన తరువాత మరోసారి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదానికి సంబంధించి ఆయన సమక్షంలోనే పంచాయతీ జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని కొలికపూడి భావిస్తున్నారు అని అంటున్నారు. ఆయన తన మనసులోని బాధను అసంతృప్తిని అధినాయకత్వానికి చెబుతారు అని అంటున్నారు. అయితే గతంలో మాదిరిగా కొలికపూడికి దిశా నిర్దేశం చేసి వదిలేసే అవకాశం ఉందా లేక చర్యలకు అధినాయకత్వం దిగుతుందా అన్నదే చర్చగా ఉంది. ఇక కొలికపూడి అయితే తగ్గేది లేదని అంటున్నట్లుగా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.