టీడీపీ పార్టీ క్యాడర్ వీక్...గవర్నమెంట్ స్ట్రాంగ్...నెక్స్ట్ పరిస్థితి ఏంటి ?

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే బలంగానే ఉంది అని జవాబు వస్తుంది. చంద్రబాబు అసలే వ్యూహకర్త.;

Update: 2025-08-22 09:59 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే బలంగానే ఉంది అని జవాబు వస్తుంది. చంద్రబాబు అసలే వ్యూహకర్త. ఆయనకు తోడు అన్నట్లుగా మరో రెండు పార్టీలు వచ్చి చేరాయి. దాంతో మూడు పార్టీలతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా ఉంది. పైగా బాబు అనుభవశాలి కావడంతో కూటమిలో ఎలాంటి లుకలుకలు లేకుండా చూసుకుంటున్నారు. అంతా ఒక మాట ఒకే బాటగా ముందుకు సాగుతున్నారు.

సూపర్ సిక్స్ తో దూకుడు :

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మెజారిటీని టీడీపీ ప్రభుత్వం అమలు చేసి చూపించింది. సాధారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పెద్దగా నిలబెట్టుకోలేదని ఒక విమర్శ ఉంది. ఈసారి మాత్రం అలాంటిది ఏదీ లేకుండా సాధ్యమైనంత త్వరగానే హామీలను నెరవేర్చడం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. సూపర్ సిక్స్ హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని వైసీపీ భావించినా అలాంటిది ఏదీ లేదని నిరూపించింది. దాంతో సూపర్ సిక్స్ హామీలతో కూటమి ప్రభుత్వం పూర్తి బలంగా ఉంది అని నివేదికలు వస్తున్నాయి.

దూసుకుని పోతున్న వేళ :

అలా కూటమి ప్రభుత్వం బ్రేకుల్లేని బండిగా దూసుకుని పోతున్న వేళ టీడీపీకి అడ్డూ అవాంతరాలు విపక్షాల నుంచి అయితే రావడం లేదు అని అంటున్నారు. మరెక్కడ నుంచి అంటే పార్టీ క్యాడర్ నుంచే అని చెబుతున్నారు. వింతగా విచిత్రంగా ఉన్నా ఇదే నిజం అని అంటున్నారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అంటే మాకెందుకు అన్న నిర్లిప్తతతో ఉంటున్నారు అని అంటున్నారు. పనిచేయడం లేదని అంటున్నారు. వైసీపీలో క్యాడర్ సహాయ నిరాకరణ ఎలా ఉందో అచ్చం అలాగే టీడీపీలో ఉంది అని అంటున్నారు.

కేసులు ఎందుకు పెట్టించుకోవాలి :

మరీ దూకుడు చేస్తూ జనంలో ఉంటూ గట్టిగా పనిచేస్తే రేపటి రోజున వైసీపీ ప్రభుత్వం వస్తే తమ మీద కేసులు పడతాయని కార్యకర్తలు అంటున్నారని టాక్ ఉందిట. అంతే కాదు ప్రభుత్వం పధకాల మీద దృష్టితో ఉంది. దాంతో క్యాడర్ తో గ్యాప్ అయితే వస్తోంది అని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేల తీరు చూస్తే అది కూడా ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఎవరి స్థాయిలో వారు చేస్తున్న దూకుడు వల్ల అవినీతి ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ లో ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల అవినీతి మీద కధలు కధలుగా వస్తున్నా చంద్రబాబు అయితే సరైన యాక్షన్ తీసుకోవడం లేదు అన్న చర్చ కూడా ఉంది. బహుశా ఈ రకమైన ధైర్యం వల్లనే వారు మరింత స్పీడ్ పెంచి తమకు తోచినట్లుగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

ప్రభుత్వానికే మార్కులు కానీ :

ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది అన్నది సాదర జనంలో వస్తున్న మాట. ఆ విధంగా మంచి మార్కులు పడుతున్నాయి. కానీ పార్టీ తీరే టీడీపీలో బాగా లేదని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది పై స్థాయికి తెలియదా తెలిసినా యాక్షన్ తీసుకోలేకపోతున్నారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు చాలా మంది పార్టీ ఆఫీసు ముఖం కూడా చూడడం లేదంటే ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు. సంపాదనలో పడిన నేపథ్యంలో వారి వల్లనే జనంలో వ్యతిరేకత అయితే వేగంగా వస్తోంది అంటున్నారు.

ఎంత ప్రభుత్వం బాగా పనిచేసినా పార్టీ తీరు కూడా బాగుంటేనే మేలు జరుగుతుందని అంటున్నారు. అందువల్ల పార్టీని కూడా సూపర్ అనేలా హైకమాండ్ సరైన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. లేకపోతే తర్వాత పరిస్థితి ఏమిటి అన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందని అంటున్నారు. ఈ విషయంలో అయితే ఎవరికి వారుగానే పార్టీ హితైషులుగా సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరి పెద్దలు ఫోకస్ పెట్టాల్సిందే అంటున్నారు. సో మొత్తానికి అదన్న మాట అసలు మ్యాటర్.

Tags:    

Similar News