సీనియర్ ఎన్టీఆర్ మ్యాజిక్ విజయ్ రిపీట్ చేస్తారా ?

అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రం విజయ్ పార్టీ కింగ్ అంటోంది. అందరి అంచనాలకు భిన్నమైన తీరులో ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ని వెలువరించింది.;

Update: 2026-04-30 04:04 GMT

ఈసారి తమిళనాడు ఎన్నికలు ఇంత ఆసక్తిగా ఆకర్షణీయంగా మారాయి అంటే దానికి కీలకమైన కారణం దళపతి విజయ్ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన వెండి తెర మీద సూపర్ స్టార్. మూడు దశాబ్దాలకు పైగా తన సినీ గ్లామర్ తో జనాలను ఎట్రాక్ట్ చేసిన బిగ్ ఫిగర్. అలాంటి విజయ్ పార్టీ పెట్టి జనం ముందుకు వచ్చారు. అంతే కాదు సోలోగా పోటీ చేశారు. రాజకీయంగా చూస్తే ఆయన యువకుడి కిందనే లెక్క. యాభై ఏళ్ళు దాటిన విజయ్ కి అటు సీనియర్లు ఇటు యువత మధ్యతరగతి వర్గాలు కనెక్ట్ అవుతున్నారని ప్రీ పోల్ సర్వేలు అయితే చెబుతూ వచ్చాయి. అయితే చిత్రంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఆయన ప్రభావం ఉందని అంటున్నాయి. రకరకాలైన సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో విజయ్ పార్టీ బాగానే ఓటు షేర్ ని రాబడుతుందని చెప్పాయి. కానీ గెలుపునకు ఆమడ దూరంలో నిలుస్తుందని పేర్కొన్నాయి.

ఏకైక సంస్థగా :

అయితే యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రం విజయ్ పార్టీ కింగ్ అంటోంది. అందరి అంచనాలకు భిన్నమైన తీరులో ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ని వెలువరించింది. ఈ సంస్థ చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక విజయ్ టీవీకే పార్టీకి అనూహ్యమైన నంబర్ తో 98 నుంచి 120 స్థానాలను దక్కించుకునే చాన్స్ ఉందని చెబుతోంది. మిగిలిన సంస్థలు అన్నీ 18 నుంచి 30 స్థానాల దాకా వస్తాయని మాత్రమే చెప్పాయి. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రమే ఈ కొత్త నంబర్ ఇచ్చింది.

పొలిటికల్ స్టార్ గా :

ఉమ్మడి ఏపీలో చూస్తే 1983లో సీనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన విజయం సాధించారు. ఆనాడు మూడున్నర దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ వట వృక్షాన్ని కూల్చివేశారు. మరి తమిళనాడులో ఆరు దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ పార్టీలను రెండింటినీ సైడ్ చేసి పారేసి తాను అధికారంలోకి వచ్చేంతగా దమ్ము ఉందా ఆ మాదిరిగా జనాలను ఆకట్టుకున్న తీరు లో విజయ్ పార్టీ టీవీకే పర్ఫార్మెన్స్ ఉందా అన్నదే చర్చగా ఉంది. అయితే అదే జరిగితే మాత్రం విజయ్ పొలిటికల్ గా సూపర్ స్టార్ అవుతారని కూడా అంటున్నారు.

మార్పు బలీయంగా ఉంటే :

అయితే రాజకీయాల్లో జనాల ఆలోచనలు అంచనాలు ఎవరూ నూరు శాతం పట్టుకోలేరు, పసిగట్టలేరు. అలా ఆలోచించినపుడు విజయ్ పార్టీ అయితే జనాల మనసులోకి వెళ్ళి రాష్ట్రంలో మార్పు కొత్త పార్టీతోనే వస్తుందని బలీయంగా నమ్మితే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ చేసిన ఫీట్ విజయ్ తమిళనాడులో చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు అయితే అంతటి పొలిటికల్ వ్యాక్యూం ఉందా అన్నది ఒక ప్రశ్న అయితే విజయ్ పార్టీని అంతటి పార్టీ నిర్మాణం ఉందా అన్నది మరో చర్చ. ఇక అంత వ్యతిరేకత డీఎంకే అన్నా డీఎంకే వంటి ద్రవిడ పార్టీలు మూట కట్టుకున్నాయా అన్నది ఇంకో ప్రశ్న వీటికి సమాధానాలు మే 4న లభించబోతున్నాయి.

Tags:    

Similar News