త‌మిళ‌నాట పొలిటిక‌ల్ హీరోలు.. పెరుగుతున్న ట్రెండ్‌!

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ హీరోల ప్ర‌స్థానం పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

Update: 2026-07-28 10:23 GMT

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సినీ హీరోల ప్ర‌స్థానం పెరుగుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి విజ‌య్‌.. సినిమా హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న స‌మ‌యంలోనే త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం పార్టీ(టీవీకే)ని స్థాపించి రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించారు. వ‌చ్చీ రావ‌డంతోనే ఏడాదిన్న‌ర‌లో నే ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. గ‌తంలో ఎంజీఆర్ త‌ర్వాత‌.. ఈ స్థాయిలో ప్ర‌జ‌ల అభిమానం చూరగొన్న యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఇప్పుడు ఇద్ద‌రు హీరోలు ఇదే బాట‌లో ఉన్నారు. ధ‌నుష్ , విశాల్ ఇద్ద‌రూ రాజకీయాల్లోకి వ‌చ్చేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు. విశాల్ త‌న ప్ర‌ణాళిక‌ల‌ను కూడా వివ‌రించారు. అయితే.. నేరుగా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. భ‌విష్య‌త్తులో తాను ప్ర‌జ‌ల‌కు సేవ చేసి.. వారి రుణం తీర్చుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. ''నాపై ఎన్నో కోట్ల మంది అభిమానం చూపిస్తున్నారు. వారి అభిమానాన్ని దాచుకుని.. దానినే ప్ర‌జాసేవ‌కు వినియోగించుకుంటా'' అని చెప్పారు. సో.. దీంతో ఆయ‌న కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని త‌మిళ‌నాట చ‌ర్చ ఊపందుకుంది.

ఇక‌, రెండు రోజుల కింద‌ట ధ‌నుష్ కూడా.. ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌కీయాల్లోకి రావాల‌న్న త‌న అభిప్రాయాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రోవైపు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, డ్యాన్స‌ర్ రాఘవ లారెన్స్ సైతం.. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే నేరుగా ఎన్నిక‌ల్లోకి రాకుండా.. ముందు ప్ర‌జ‌ల దగ్గ‌ర మార్కులు వేయించుకుని, వారికి సేవ చేసి.. త‌ర్వాత‌.. పోటీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇలా.. ఒక‌రికి మించి ఎక్కువ మంది త‌మిళ‌నాట రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

విజ‌య్ స‌క్సెస్‌తోనే..

ప్ర‌స్తుతం యువ ట్రెండ్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో విజ‌య్‌ను ఆద‌ర్శంగా తీసుకునే కొత్త వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. అంద‌రూ స‌క్సెస్ అవుతారా? అనేది మాత్రం సందేహ‌మేన‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్న హీరోలు కూడా రాజ‌కీయ బాట ప‌డుతున్న నేప‌థ్యంలో ఎవ‌రికి ప్ర‌జ‌ల్లో ఎంత ఇమేజ్ ఉంటుంది? అనే అంశాల‌పై అంచ‌నాలు కొన‌సాగుతున్నాయి.

Tags:    

Similar News