బ్రేకింగ్ : డ్ర*గ్స్ కేసులో పోలీసుల అదుపులో హీరో?
తమిళ సినీ పరిశ్రమలో డ్ర*గ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు శ్రీరామ్ (అసలు పేరు శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్ర*గ్స్ కొనుగోలు కేసులో అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తల వస్తున్నాయి.;
తమిళ సినీ పరిశ్రమలో డ్ర*గ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ప్రముఖ నటుడు శ్రీరామ్ (అసలు పేరు శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్ర*గ్స్ కొనుగోలు కేసులో అదుపులోకి తీసుకున్నట్టు మీడియాలో వార్తల వస్తున్నాయి. ప్రముఖ తమిళ రాజకీయ నాయకుడు, మాజీ ఏఐఎడీఎంకే నేత ప్రసాద్ వద్ద నుండి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ్‌పై కేసు నమోదైంది.
తిరుపతికి చెందిన శ్రీకాంత్ నటనపై ఆసక్తితో చెన్నై వెళ్లి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తమిళంలో 'రోజా కూటం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తెలుగులో 'రోజా పూలు'గా విడుదలైంది. అప్పటికే తెలుగులో శ్రీకాంత్ అనే హీరో ఉండటం వల్ల తన పేరును శ్రీరామ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత 'ఒకరికి ఒకరు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'పోలీస్ పోలీస్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవల శ్రీరామ్ 'హరికథ' అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా డ్ర*గ్స్ కేసులో ఆయన పేరు బయటకు రావడం కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకొని, నుంగంబాక్కం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ రెండు గంటలపాటు ఆయనను విచారించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ సేకరించారు.
ఈ కేసులో శ్రీరామ్‌తో పాటు ప్రసాద్, మరో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిని విచారిస్తున్న సమయంలో శ్రీరామ్ పేరు బయటకు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
శ్రీరామ్ అరెస్ట్ కావడం తో తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ‘స్నేహితులు’ సినిమాలో అగ్రహీరో విజయ్, జీవాతో కలిసి నటించిన శ్రీరామ్, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన నటించిన ‘ఎర్రచీర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనన్న ఉత్కంఠ కోలీవుడ్‌ను చుట్టుముట్టింది. సినీ, రాజకీయ రంగాల్లో ఈ ఘటన పెద్ద దుమారం రేపుతోంది.