పార్టీలో కొకైన్ సరఫరా.. చిక్కుల్లో విశ్వ‌న‌టుడు!

'సింగర్ సుచిత్ర ఇటీవల కమల్ హాసన్ తన పార్టీలలో కొకైన్ వాడుతున్నారని ఆరోపించారు.

Update: 2024-05-17 03:44 GMT

కోలీవుడ్‌లో కొకైన్ స‌ర‌ఫ‌రా పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా విశ్వ‌న‌టుడుగా పేరొందిన‌.. క‌మ‌ల్ హాస‌న్ చుట్టూ.. ఈ వివాదం మ‌రింత ర‌చ్చ‌కెక్కింది. సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు ఆరోప‌ణ‌లు పెల్లుబుకుతున్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ త‌మిళ‌నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్ చేశాడు.

'సింగర్ సుచిత్ర ఇటీవల కమల్ హాసన్ తన పార్టీలలో కొకైన్ వాడుతున్నారని ఆరోపించారు. తమిళ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌లో చిక్కుకుంది`` అని నారాయ‌ణ‌న్ పేర్కొన్నారు. అయితే.. దీనిపై క‌మ‌ల్ హాస‌న్ ఇప్ప‌టి వ‌రకు స్పందించ‌లేదు. మ‌రోవైపు.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి కూడా ప‌లువురు క‌మ‌ల్ పై ఫిర్యాదులు చేశారు. అయితే. క‌మ‌ల్‌పై ఆరోప‌ణలు ఇప్పుడు కొత్త‌కాదు. 2015లో కూడా.. ఆయ‌న డ్ర‌గ్స్ తీసుకుంటున్నా ర‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు కూడా వ‌చ్చాయి.

Read more!

కానీ.. ప్ర‌భుత్వాలు మాత్రం సీరియ‌స్‌గా తీసుకోకపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇక్క‌డ నారాయ‌ణ‌న్ తిరుప తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం వెనుక‌.. రీజ‌నేంట‌నేది ఆస‌క్తిగా మారింది. క‌మ‌ల్ హాస‌న్ తిరుప‌తిలోని అట‌వీ ప్రాంతంలో కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కొకైన్ స‌ర‌ఫ‌రా చేశార‌నే వార్త‌లు అప్ప‌ట్లోనే కోలీవుడ్‌ను కుదిపేశాయి. అయితే.. ఆ త‌ర్వాత అంతా చ‌ల్లారిపోయింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా నారాయ‌ణన్ ఫిర్యాదు చేయ‌డం, సింగ‌ర్ సుచిత్ర కూడా వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఈ విష‌యం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News